వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ హెరాల్డ్: సోనియా, రాహుల్‌పై ఈడి దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ స్కాం కేసులో సోనియా, రాహుల్‌పై మళ్లీ దర్యాప్తు చేసేందుకు రంగం చేసింది ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరేక్టరేట్(ఈడి).

గత ఆగస్టులోనే వీరికి ఈ కేసులో విషయంలో క్లీన్ చిట్ లభించినప్పటికీ ఈడి మాత్రం మరోసారి దర్యాప్తు చేయనుంది.

కాగా, అంతకుముందు పరిణామాలను గమనించినట్లయితే.. ఈ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ చర్యలను కోర్టు ఆగస్టు 13 వరకు నిలిపివేసింది. సోనియా, రాహుల్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు.. భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ED reopens National Herald case involving Sonia and Rahul Gandhi, which was closed in August

ప్రస్తుతం మూతపడిన నేషనల్ హెరాల్డ్ దినపత్రికను ప్రచురించే ఒక కంపెనీకి చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై తమకు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆగస్టు 5నాటికి నోటీసులకు సమాధానాలు అందజేయాలని జస్టిస్ విపి వైశ్ స్వామిని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఆగస్టు 7న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ గత జూన్ 26న సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు, సోనియా, రాహుల్‌కు వాటాలున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు సుమన్ దూబే, శామ్ పిట్రోడాలకు గత జూన్ 26న సమన్లు జారీ చేసింది.

ట్రయల్ కోర్టు సమన్లను, బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ వోరా కూడా సోనియా, రాహుల్‌తో పాటుగా హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక రాజకీయ ప్రత్యర్థి అని, రాజకీయ ప్రయోజనాలను పొందడం కోసమే ఆయన తమపై ఈ కేసు పెట్టారని కాంగ్రెస్ నాయకులు తమ పిటిషన్‌లో ఆరోపించారు.

English summary
In a big jolt to Congress, the Enforcement Directorate has reopened the investigation into the National Herald case which involves party president Sonia, vice president Rahul Gandhi and other party leaders. ED has rejected the opinion of former top officer that favoured closure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X