వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలాసపురుషుడికి పెద్ద షాక్! ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపట్టిన ఈడీ!

పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్‌ టైకూన్‌ విజయ్‌మాల్యాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయన ఆస్తుల స్వాధీనం వేగవంతం చే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్‌ టైకూన్‌ విజయ్‌మాల్యాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయన ఆస్తుల స్వాధీనం వేగవంతం చేసింది.

ముందుగా మాల్యాకు అత్యధిక పట్టున్న యునైటెడ్‌ బ్రూవరీస్‌పైనే దృష్టిపెట్టింది. ఈ కంపెనీలో మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది.

ED starts process of confiscating Vijay Mallya's assets

రెండునెలల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ మేరకు ఓ లేఖను ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు పంపించింది. దీని ప్రకారం తాకట్టులోని లేని యబీఎల్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లలోని మాల్యా షేర్లను కేంద్రానికి బదిలీ చేయాల్సిందిగా కోరింది.

ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా.
ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్‌ఎల్‌కు చెందిన 25.1 లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను అటాచ్‌ చేసింది.

వీటితోపాటు విజయ్ మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై కూడా ఈడీ దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, కింగ్‌ఫిషర్‌ ఫిన్‌వెస్ట్‌ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్‌, ఫార్మాట్రేడింగ్‌ కంపెనీ, విట్టల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, కామ్‌స్కో ఇండస్ట్రీస్‌, 'ది గెమ్‌' ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చనిపోయిన సందర్భంలో గానీ, నేరస్తుడిగా గుర్తించిన సందర్భంలో గానీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీచేయవచ్చు.

English summary
The Enforcement Directorate, India's premier anti-money laundering agency, has started the process of confiscating Vijay Mallya's assets that were frozen during the course of money laundering investigation against the embattled liquor baron. ED that works under the revenue department of India's finance ministry has powers to do so under section 9 of the Prevention of Money Laundering Act. A report in The Indian Express quotes some unidentified sources as saying that the Stock Holding Corporation of India has transferred to the central government the rights and title of shares worth Rs 100 crore. These shares were held either directly or indirectly by Vijay Mallya in the United Breweries that claims to be an "undisputed king of Indian beer market".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X