వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ED Target: మొన్న నటి కంగనా, నిన్న అర్నబ్, ఎమ్మెల్యేకి జీడిపప్పు ఉప్మా, పెసరట్టు, మనీలాండరింగ్ కేసు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: సెక్యూరిటీ ఎజెన్సీ నిర్వహిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే అయిపోయాడు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా గొంతు ఎత్తి ఒక్కసారిగా పాపులర్ యిపోయాడు. ఎమ్మెల్యే దెబ్బకు కంగనా రనౌత్ పై కేసు నమోదు కావడం, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్టు కావడంతో ఆ ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో ఆమె ఎమ్మెల్యేకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మంగళవారం మసాలా దోసె, జీడిపప్పు ఉప్మా పెసరట్టు తినిపించి పట్టపగలు త్రీడి సినిమా చూపిస్తున్నారు.

Super: ప్రధానితోనే సాధ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ గల్లంతు !Super: ప్రధానితోనే సాధ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ గల్లంతు !

పాపులర్ అయిపోయిన ఎమ్మెల్యే

పాపులర్ అయిపోయిన ఎమ్మెల్యే

మహారాష్ట్రలో ఇటీవల కాలంలో అధికార పార్టీ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ చాలా పాపులర్ అయ్యాడు. థానేలోని ఓవాలా- మూజివాడ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన ప్రతాప్ సర్నాయక్ నివాసంపై మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.

టాప్ సెక్యూరిటీ ఎజెన్సీ

టాప్ సెక్యూరిటీ ఎజెన్సీ

శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ముంబాయి నగరంలో పాటు మహారాష్ట్రతో సహ దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు సెక్యూరిటీ సేవలు అందిసోంది. థానేలోని సెక్యూరిటీ సంస్థ, శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నివాసాలతో పాటు ముంబాయిలోని 10 వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈడీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.

 మొన్న కంగనాతో పెట్టుకున్నాడు

మొన్న కంగనాతో పెట్టుకున్నాడు

మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నాయకుల మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొంతకాలం కారాలు మిరియాలు నూరుతూ వస్తోంది. ఇదే సమయంలో నటి కంగనా రనౌత్ దేశద్రోహి, ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటాము, ముంబాయిలో ఆమె అడుగుపెట్టకుండా చేస్తాం అంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చాడు.

రిపబ్లిక్ టీవి చీఫ్ అర్నబ్ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే

రిపబ్లిక్ టీవి చీఫ్ అర్నబ్ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే

ముంబాయికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసు మళ్లీ విచారణ చెయ్యాలని డిమాండ్ చేస్తూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు అయ్యి వారం రోజుల పాటు జైల్లో ఉండి తరువాత సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

Recommended Video

GHMC Elections 2020: AIMIM MLA Mumtaz Ahmed Khan sensational statement
 ఎమ్మెల్యేకి జీడిపప్పు ఉప్మా... పెసరట్టు రెఢీ

ఎమ్మెల్యేకి జీడిపప్పు ఉప్మా... పెసరట్టు రెఢీ

శివసేన ఎమ్మెల్యేకి ఈడీ అధికారులు జీడిపప్పు ఉప్మా, పెసరట్టు తినిపించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇంటిలో సోదాలు చేస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో ఈడీ అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మా పార్టీ నాయకులపై కక్షసాధింపులకు దిగుతోందని, మేము న్యాయపోరాటం చేస్తామని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. మొత్తం మీద నటి కంగనా రనౌత్, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి మీద ఇంతకాలం విరుచుకుపడిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కు ఈడీ అధికారులు మనీలాండరింగ్ రుచి చూపిస్తున్నారు.

English summary
ED Target: Thane Shiv Sena MLA Pratap Sarnaik’s residence and office was raided by Enforcement Directorate officials on Tuesday morning in connection with a money laundering probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X