వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ.. రాజ్ ఠాక్రే... పెట్టుబడి పెట్టకుండానే రూ.20 కోట్లు.. రంగంలోకి ఈడీ..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజ్ ఠాక్రేపై పోకస్ పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ || Oneindia Telugu

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పోకస్ చేసింది. మాతో శ్రీ రియల్టర్ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే రూ.20 కోట్ల లాభం పొందడంపై ఆరాతీస్తోంది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. పెట్టుబడులపై ఆరా, లాభం తదితర అంశాలపై పూర్తి వివరాలను సేకరించింది.

కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీలో మాతోశ్రీ రియల్టర్స్ భాగస్వామిగా ఉంది. 2008లో మాతో శ్రీ సంస్థ తరఫున రాజ్ ఠాక్రే భాగస్వామిగా ఉన్నారు. అయితే పెట్టుబడులు మాత్రం పెట్టలేదు. ముంబైలోని దాదార్లో కోహినూర్ స్వ్కేర్ టవర్ నిర్మాణం జరిగింది. కానీ రాజ్ ఠాక్రేకు మాత్రం లాభాల్లో రూ.20 కోట్లను కోహినూర్ కంపెనీ అందజేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఏం జరిగిందనే అంశంపై ఈడీ విచారణ జరుపుతుంది. అప్పటి లావాదేవీలకు సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ అధికారులు నిర్ధారించారు.

ED to look into Raj Thackeray gaining Rs 20 crore without investing

కోహినూర్, మాతో శ్రీ రియల్టర్ కంపెనీలో మొత్తం 8 మంది భాగస్వాములుగా ఏర్పడి నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. రాజ్ ఠాక్రేతోపాటు ఎమ్మెన్నెస్ నేత రజన్ శిరోద్కర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. కోహినూర్ సంస్థ కేపీపీఎల్ సంస్థలో భాగస్వామి అని ఈడీ విచారణలో తెలిసింది. ఉన్మెష్ జోషి, ఇతరులు ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఆయా కంపెనీల్లో భాగస్వామ్యాలకు సంబంధించి ఉమ్నెష్ జోసి, రజన్ శిరోద్కర్‌ను సోమవారం ఈడీ విచారించింది. దాదాపు ఏడుగంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. వీరితోపాటు మరికొందరు కూడా భాగస్వామ్యంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని .. ఇందులో అవకతవకలకు సంబంధించి సమన్లు జారీచేస్తామని ఈడీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

English summary
the Enforcement Directorate (ED), probing a money laundering case, is now looking into how MNS chief Raj Thackeray walked away with a profit of Rs 20 crore in 2008 without any investment in Matoshree Realtors -- part of Kohinoor CTNL. Kohinoor CTNL has been constructing Dadar's Kohinoor Square towers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X