వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం: బెంగాల్‌లో ప్ర‌చారం స‌స్పెండ్‌: పార్టీల‌కు షాక్‌..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బెంగాల్‌లో బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా రోడ్ షో స‌మ‌యంలో చెల‌రేగిన హింస పైన పెద్ద ఎత్తున ఆందోళ‌న జ‌రుగుతోంది. దీని పైన బెంగాల్ లోని ఎన్నిక‌ల అధికారుల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మీక్షించింది. దీని పైన దేశ ఎన్నిక‌ల్లోనే తొలి సారిగా ఎన్నికల ప్రచారాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

 బెంగాల్‌లో ప్ర‌చారం స‌స్పెండ్‌..

బెంగాల్‌లో ప్ర‌చారం స‌స్పెండ్‌..

ఈ నెల 19న జ‌ర‌గ‌నున్న చివ‌రి ద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతున్న బెంగాల్‌లోని తొమ్మ‌ది పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజక వర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. ఈ తరహాలో ఆర్టికల్ 324ను ఈసీఐ అమలు చేయడం ఇదే మొదటిసారి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జరిపిన రోడ్‌షో సందర్భెంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్న నేపథ్యంలో ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర బ‌ల‌గాలే ర‌క్షించాయి..

కేంద్ర బ‌ల‌గాలే ర‌క్షించాయి..

ఆరు విడతల ప్రచారంలో ఒక్క పశ్చిమబెంగాల్‌లో మినహా ఎక్కడా హింస చెలరేగలేదని బిజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. కోల్‌కతాలో హింసాకాడం చెలరేగిన సమయంలో సీఆర్‌పీఎఫ్ కనుక అక్కడ లేకుండా ఉంటే దాడి నుంచి తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని, బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టారని చెప్పారు. టీఎంసీ ఎంత వరకైనా వెళ్తుందని, దాడి నుంచి తాను అదృష్టం వల్లే తప్పించుకోగలిగానని అమిత్‌షా చెప్పారు. తన రోడ్‌షోకు ముందు బీజేపీ బ్యానర్లు తొలిగిస్తుంటే పోలీసులు మౌనప్రేక్షకులుగా మిగిలిపోయాయని, ప్రధాని పోస్టర్లు, తన పోస్టర్లు చింపేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని అమిత్‌షా తెలిపారు.

దీదీ నిర‌స‌న ర్యాలీ..

దీదీ నిర‌స‌న ర్యాలీ..

బెంగాల్‌‌లో బీజేపీ హింసాకాండను రెచ్చగొడుతోందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జరిపిన రోడ్‌షోలో జరిగిన హింసాకాండకు బయట రాష్ట్రాల నుంచి బీజేపీ తీసుకువచ్చిన కిరాయి గూండాలే కారణమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తృణమూల్ ఇందుకు నిరసనగా భారీ రోడ్‌షో నిర్వహించింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ జెండాలు, బ్యానర్లతో పాల్గొన్నారు. అమిత్‌షా రోడ్‌షోలో చోటుచేసుకున్న హింసాకాండకు మీది బాధ్యతంటే మీది బాధ్యతంటూ బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం ఇవాళ తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మమతా బెనర్జీపై నిషేధం విధించాలని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కోరింది. అయితే, ఎన్నిక‌ల సంఘం అస‌లు ప్ర‌చార‌మే లేకుండా స‌స్పెండ్ చేసింది.

English summary
In a shock to the parties Election Commission has passed orders that no campaigning should be done in Bengal. This will be applicable from 16th may 10 am. This is the first time in Election Commission History.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X