బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ ఎఫెక్ట్: ప్రభుత్వం సంచలన నిర్ణయం, స్కూల్స్ క్లోజ్, బెంగళూరు టెక్కీ, ఫ్యామిలీకి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ (కోవిడ్- 19) భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు (నర్సరి, ఎల్ కేజీ, యూకేజీ) స్కూల్స్ పూర్తిగా మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10వ తేదీ మంగళవారం ఉదయం నుంచి తాము సూచించే వరకు ఈ పాఠశాలు మూసివేయాలని, మళ్లీ ఎప్పుడు స్కూల్స్ ప్రారంభించాలో తాము చెబుతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

Coronavirus In Karnataka : Bengaluru In High Tension | Oneindia Telugu

అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!

మా మాట వినాలంటున్న మంత్రి

మా మాట వినాలంటున్న మంత్రి

కర్ణాటకలోని ప్రాథమిక పాఠశాలలకు తాము సెలవులు ప్రకటించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అన్నారు. విద్యాశాఖా ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, బీబీఎంపీ, బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, జిల్లాల పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు మంగళవారం ఉదయం నుంచి వెంటనే మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అన్నారు. చిన్నారులకు కరోనా వైరస్ తో పాటు, అంటు వ్యాధులు వ్యాపించకుండా గట్టిచర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ వివరించారు.

బెంగళూరు టెక్కీకి తొలి కరోనా వైరస్

బెంగళూరు టెక్కీకి తొలి కరోనా వైరస్

అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ)కి కరోనా వైరస్ వ్యాధి సోకిందని నిర్దారణ అయ్యింది. టెక్కీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నామని, ఆ వ్యాధి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కె. సుధాకర్ మీడియాకు చెప్పారు. బెంగళూరు నగరంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు.

కేరళ దెబ్బకు కర్ణాటక అలర్ట్

కేరళ దెబ్బకు కర్ణాటక అలర్ట్

భారతదేశంలో మొదట కరోనా వైరస్ వ్యాధి కేసు నమోదు అయ్యింది కేరళ రాష్ట్రంలో. వుహాన్ నుంచి ఒకేసారి ప్రయాణించిన ముగ్గురు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆ ముగ్గురు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకుంటున్నారు. కేరళలో జరిగిన సంఘటన కర్ణాటకలో వెలుగు చూడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు మూసివేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖా అధికారులు తెలిపారు.

బెంగళూరులో భయం భయం!

బెంగళూరులో భయం భయం!

బెంగళూరు నగరం నిత్యం రద్దీగా ఉంటోంది. బెంగళూరు ప్రజలు బయటకు వెళ్లి సంచరించడానికి కొంచెం భయపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. అయితే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించాలన్నా, పిల్లలను బయటకు పంపించాలాన్నా, ముఖ్యంగా సిటీ బస్సులో ప్రయాణించాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆ ఒక్క ధీమాతో ఉన్నాం

ఆ ఒక్క ధీమాతో ఉన్నాం

భారతదేశంలో ఇప్పటి వరకు 43 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. భారత్ లో కరోనా వైరస్ వ్యాధి సోకిన బాధితులకు వెంటనే చికిత్స అందించడంతో వారు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో భారతదేశంలో ఒక్కచావు చోటు చేసుకోలేదు. కరోనా వైరస్ వ్యాధి సోకిన 43 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇంత వరకు భారత్ లో ఒక్కరు కూడా కరోనా వైరస్ వ్యాధితో మరణించకపోవడంతో ఆ ఒక్క ధీమాతోనే ప్రజలు కొంచెం ధైర్యంగా ఉన్నారని సమాచారం.

English summary
Bengaluru: Effect Of Coronavirus, Minister Dr Sudhakar announces that Karnataka Government Declared Holiday For primary (5th standard) Students From March 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X