బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గౌరీ లంకేశ్ హత్య: రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో రెండో నిందితుడిని సిట్ గురువారం అరెస్ట్ చేసింది. గౌరీ లంకేశ్ హత్య జరిగిన ఎనిమిది నెలలకు ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.

అయితే నిందితుడి వివరాలను మాత్రం సిట్ వెల్లడించలేదు. గతంలో 2013లొ జరిగిన ఎంఎం కల్బుర్గీ హత్య, 2015లొ జరిగిన నరేంద్ర ధబోల్కర్ హత్యలతోనూ నిందితుడికి సంబంధం ఉండవచ్చునని సిట్ అనుమానిస్తోంది.

Eight months after Gauri Lankesh’s murder, 2nd man detained

కాగా, గతేడాది సెప్టెంబరు 5వతేదీన బెంగళూరులోని తన నివాసం వద్ద గౌరీ లంకేశ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసులో ఇప్పటికే అరెస్టయిన నవీన్ కుమార్ అనే వ్యక్తి రెండో నిందితుడి గురించి సిట్ అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్ట్ జరిగినట్టు సమాచారం.

కాగా, మార్చి 3-8వ తేదీల్లో నవీన్ ను సిట్ విచారించింది. గౌరీ హత్యతో నవీన్ కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు సిట్ నిర్దారించింది. తానే ఆయుధాలు సమకూర్చి కొంతమందికి శిక్షణ కూడా ఇచ్చినట్టు సిట్ గుర్తించింది.

English summary
The Special Investigation Team (SIT) probing the murder of journalist activist Gauri Lankesh has reportedly detained one man earlier this week for allegedly being part of the conspiracy to kill her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X