వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ లో తుపాకుల మోత .. రెండు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్.. 8 మంది ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్ లో తుపాకీ శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. భారతదేశం టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల వేట మొదలు పెట్టింది . ఉగ్రవాదుల కదలికల నేపధ్యంలో గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి .ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్రాంతాలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులను మట్టుబెట్టారు .

జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్

24 గంటల్లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్, పాంపూర్‌లో ఎన్‌కౌంటర్లు

24 గంటల్లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్, పాంపూర్‌లో ఎన్‌కౌంటర్లు

గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్, పాంపూర్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. పాంపూర్ ఆపరేషన్లో, మసీదు లోపల నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి . మసీదు యొక్క పవిత్రతను కాపాడటానికి ఆరు మసీదులోపల కాల్పులు జరపకుండా కేవలం భాష్ప వాయువు మాత్రమే ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు.

మసీదులో నక్కిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ , పోలీసులు

మసీదులో నక్కిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ , పోలీసులు

మీజ్ పాంపూర్ వద్ద ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు మసీదు యొక్క పూర్తి పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక ప్రజలు మరియు మసీదు కమిటీ ఆర్మీ తీసుకున్న నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేసింది. జిల్లా పోలీసు చీఫ్ మిస్టర్ తాహిర్ (సలీమ్) కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ఆర్మీ మరియు సిఆర్పిఎఫ్ జవాన్లను వారు అభినందించారని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు.

మసీదులో పవిత్రతకు భంగం కలగకుండా టియర్ గ్యాస్ ప్రయోగం

మసీదులో పవిత్రతకు భంగం కలగకుండా టియర్ గ్యాస్ ప్రయోగం

దాదాపు ప్రతి ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరాలు (ఐఇడి) మరియు భారీ కాల్పులను ఉపయోగిస్తాయి. పోంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్, ఉగ్రవాదులను హతమార్చటానికి టియర్ గ్యాస్ ప్రయోగించటం చాలా అరుదైన ఆపరేషన్.ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు నిన్న ఉదయం రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేట ప్రారంభించాయని పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ నిర్వహించిన వారు ఫైనల్ గా 8మందిని హతమార్చినట్టు సమాచారం,

Recommended Video

#Watch : Kashmir లోని క్వారెంటైన్ ‌సెంటర్లో క్రికెట్ ఆడిన కుర్రాళ్ళు !
రెండు ప్రాంతాల్లో 8 మంది మృతి

రెండు ప్రాంతాల్లో 8 మంది మృతి

సౌత్ కాశ్మీర్ లోని మునాంద్ ప్రాంతంలో గల లోయలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తో నిర్వహించిన ఆపరేషన్ లో షోపియన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, పాంపూర్‌లో ముగ్గురు మృతి చెందారు. పాంపూర్‌లో గురువారం జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, మరో ఇద్దరు మసీదులోకి ప్రవేశించి దాని లోపల ఆశ్రయం పొందారని ఆ అధికారి తెలిపారు.ఇక వారిని కూడా హతమార్చినట్టు ప్రకటించటంతో మొత్తం మృతుల సంఖ్య 8 కి చేరింది.

English summary
Eight terrorists were killed in two encounters in Shopian and Pampore in Jammu and Kashmir in the last 24 hours. In the Pampore operation, security forces eliminated two terrorists who were holed up inside a mosque. There was "no use of firing and IEDs" and "only tear smoke shells" were used to "maintain sanctity of the mosque", the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X