వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8ఏళ్ల బాబుకి బ్రెయిన్ ట్యూమర్: సాయం చేసి ప్రాణాన్ని నిలబెట్టండి

Google Oneindia TeluguNews

"ఎబినెజర్.. నువ్వు ఇంటి ముందు ఎంతో సంతోషంగా ఫుట్ బాల్ ఆడుకుంటూ గడపటం ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. నీ నవ్వులు, కేరింతలన్నింటికీ కొన్ని రోజులుగా నేను దూరమయ్యాను. నేను మళ్లీ నీ గొంతు వినాలని పరితపిస్తున్నాను. నీతో మాట్లాడాలి. నీతో ఆడుకోవాలి. కానీ నిన్ను ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. నా గుండె అల్లల్లాడిపోతుంది. నీ రోగ నిర్ధారణ జరిగిన నాటి నుంచి మా ముఖంలో నవ్వు కొరవడింది. నా చిట్టి తండ్రీ నువ్వు మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆ భంగవంతున్న ప్రార్థిస్తున్నా. నిన్ను ఈ పరిస్థితుల్లో చూడడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు రేడియేషన్ థెరపీ కొనసాగించటానికి ప్రస్తుతం రూ. 8 లక్షల అవసరం. దేవుని మీదనే భారం వేశాను. నిన్ను ఇలా చూస్తూ గడపాల్సిన పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు నా చిట్టి కన్నా." అంటూ ఎబినెజర్ ఇమ్మాన్యుయేల్ తండ్రి స్టీఫెన్ రోధించాడు.

Eight-year-old is suffering from severe brain tumour. We need help

నా పేరు స్టీఫెన్. నా కుమారుడి పేరు ఎబినేజర్ ఇమ్మాన్యుయేల్. ఎనమిదేళ్ల వయస్సు ఉంది. మేము చెన్నైలో నివాసం ఉంటున్నాము. నా ఎనిమిది ఏళ్ల కుమారుడు పాంటిన్ గ్లియోమోతో బాధపడుతున్నాడని, వైద్యులు ధ్రువీకరించారు. ఆరోజు నుంచి నా కొడుకును కాపాడుకోవడానికి నేను అష్టకష్టాలుపడుతున్నా. ఎబినేజర్ ఈ ఏడాది ఏప్రిల్ లో తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. వెంటనే స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాం. రోగనిర్ధారణకు వేరొక ఆసుపత్రిని సూచించారు. క్రమంగా హిందూ మిషన్ ఆసుపత్రి, గ్రేస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లాం. తర్వాత ఎస్.ఆర్.ఎం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యులు నా కుమారుడు ఎబినేజర్ కు మెదడులో ట్యూమర్ ఉందని నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు, రేడియేషన్ థెరపీ కోసం అపోలో హాస్పిటల్ చేర్పించాం. కానీ అప్పటికే అతని ఎడమ భాగం అంతర్గత అవయవాలు పనిచేయడం మందగించాయి. క్రమంగా మాటలు పడిపోయాయి. అపస్మారక స్థితికి వెళ్లాడు.

ఎబినేజర్ ఇమ్మాన్యుయేల్ కు సహాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాంక్ డిటేల్స్ వస్తాయి.

శ్వాస కూడా మందగించడంతో వెంటిలేటర్లో ఉంచి శ్వాస అందివ్వడం ప్రారంభించాము. కొన్ని వారాల తర్వాత నెమ్మదిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. కానీ డిశ్చార్జ్ చేసిన 10 రోజులకే, అతని పరిస్థితి మరింత విషమంగా మారడం ప్రారంభించింది. క్రమంగా కళ్లు కూడా తెరవలేని స్థితికి వెళ్లాడు. తర్వాత కంచి కామకోటి హాస్పిటల్లో చేర్చాం. ప్రస్తుతం రేడియేషన్ థెరపీ అందిస్తున్నారు.

Eight-year-old is suffering from severe brain tumour. We need help

మా ఇల్లు, ఆ ఆసుపత్రికి కొన్ని మైళ్ళ దూరంలో ఉంది, క్రమంగా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకుని ఆసుపత్రినే నివాసంగా చేసుకుని బిడ్డ బాధ్యత చూసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం ఎటువంటి రాబడి కూడా లేదు. 3 నెలలుగా బిడ్డను చూస్కోవడంలో వృత్తికి సమయం కేటాయించలేని నిస్సహాయ స్థితి. బాబు బాద్యత చూసుకోవాలి అంటే, కనీసం ఇద్దరి సహకారం కావాలి. నేను ఒక ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ని. నా భార్య హౌస్ వైఫ్.

గతనెలలో బంధువులు, స్నేహితుల సహాయంతో మేము 11 లక్షల రూపాయల (USD 16,900) వరకూ ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం అతని చికిత్సకు తక్షణమే మరో రూ. 8 లక్షల రూపాయలను (12,300 డాలర్లు) జమ చేయాలి. అందుకోసం ప్రతి మనస్సున్న మహారాజుని మేము చేతులు చాచి కోరుతున్నాం. నిజాయితీతో కూడిన అభ్యర్థన మాది. సహాయం చేసి నా బిడ్డ ప్రాణం కాపాడండి అని వేడుకుంటున్నాను.

Eight-year-old is suffering from severe brain tumour. We need help

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎబెనెజెర్ కు సహాయం చేయడానికి మనమందరం చేతులు కలపాల్సిన అవసరం ఉంది. అతను తీవ్ర పరిస్థితి నుంచి ఉపశమనం పొందడానికి మనవైపు నుంచి చేసే చిన్న సహకారం కూడా గొప్పదే. అదే ఆ బిడ్డకి మెరుగైన జీవితాన్ని ఇవ్వగలదు. "స్టీఫెన్" కుమారుడు ఎబినేజర్ ఇమ్మాన్యుయేల్ ప్రాణాలను నిలబెట్టుకునేందుకు మన వంతు సహాయం అందిద్దాం.

ప్రాణం పోయాక చేయలేకపోయాం అని భాద పడేకన్నా, ప్రాణాన్ని నిలబెట్టడంలో చేతులు కలపడమే మంచిది. మీ బంధువులు, స్నేహితులకు ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి. నలుగురికీ సమస్యను తెలియపరచినవారవుతారు. కనికరించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X