India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Eknath shinde: ఆటో డ్రైవర్ నుంచి "మహా" ముఖ్యమంత్రి వరకు పొలిటికల్ జర్నీ

|
Google Oneindia TeluguNews

ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్రకు కాబోయే సీఎం. ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఫడ్నవీస్ సీఎం అని.. షిండే కోటరికీ 8, లేదంటే 9 మంత్రి పదవులు వరిస్తాయని చర్చ జరిగింది. అనూహ్యంగా షిండేనే సీఎం పదవీ చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీసే మీడియాకు తెలిపారు. ఇటు ఫడ్నవీస్‌ది గొప్ప హృదయం అని షిండే ప్రశంసలతో ముంచెత్తారు. అసలు షిండే ఎవరూ..? ఆటో డ్రైవర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎలా ఎదిగారు. అతని రాజకీయ నేపథ్యం ఏంటీ... వివరాలు తెలుసుకుందాం పదండి.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


సాతారా జిల్లాలో గల జవాలీ తాలుకాలో 1964 ఫిబ్రవరి 9వ తేదీన షిండే జన్మించారు. మరాఠా కులంలో జన్మించిన ఆయనది నిరుపేద కుటుంబం. అతని కుటుంబం పొట్ట కూటి కోసం ముంబై శివార్లలో గల థానేకు మకాం మార్చింది. ఆయన జీవితం ఆటో డ్రైవర్ నుంచి ప్రారంభమైంది. మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే దక్కాలని అన్న బాల్ థాకరే, థానే శివసేన జిల్లా అధ్యక్షుడు ఆనంద్ దిగే ప్రసంగాలతో ఆకర్షితులు అయ్యారు. అలా ఆయన శివసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.

శివసేనలో చేరిక

శివసేనలో చేరిక


1980లో శివసేన పార్టీలో షిండే చేరారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2001 లో థానే కార్పొరేషన్ లీడర్ ఆఫ్ హౌస్‌గా ఎన్నికయ్యారు. 2002లో మరోసారి థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తర్వాత మహా వికాస్ అగాడీ కూటమిలో పట్టణ ప్రణాళిక మంత్రిగా పనిచేశారు.

శివసేన పక్ష నేతగా

శివసేన పక్ష నేతగా

ఏక్‌నాథ్‌ షిండే 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా పని చేశారు.
శివ‌సేనపై అసంతృప్తితో తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. అయినప్పటికీ 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండగా.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు సీఎంగా

ఇప్పుడు సీఎంగా

..
ఎన్నో ట్విస్టుల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు షిండే సీఎం పదవీ అధిష్టించబోతున్నారు. ఫడ్నవీసే ఆయన పేరును ప్రకటించారు. మంత్రి పదవీ ఇస్తే.. ఎక్కడ తిరుగుబాటు చేస్తారని భావించారో ఏమో కానీ అనూహ్య నిర్ణయం వెలువరించారు. వీరికి రాజ్ థాకరే కూడా మద్దతు తెలిపారు. తన అన్న ఉద్దవ్ థాకరేపై సెటైర్లు వేశారు.

English summary
Ekanth Shinde belongs to the Maratha community. he influenced by Bal Thackeray, and Shiv Sena's Thane district chief Anand Dighe. associated with Shiv Sena in the 1980s.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X