వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరిలో సోనియా, రాహుల్.. రేపే ఐదో విడత పోలింగ్...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. ఐదో దఫా ఎన్నికల కోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తయ్యాయి. నాలుగు దశల్లో 543 సీట్లలో 373 స్థానాల్లో ఎన్నిక పూర్తికాగా.. ఈసారి 51 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. కీలకమైన స్థానాలు కావడంతో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి.

మోడీకి క్లీన్‌చిట్‌పై ఈసీలో అసమ్మతి?మోడీకి క్లీన్‌చిట్‌పై ఈసీలో అసమ్మతి?

 7 రాష్ట్రాల్లో 51 సీట్లు

7 రాష్ట్రాల్లో 51 సీట్లు

ఐదో దశ ఎన్నికల్లో 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరనుంది. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన
ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, జమ్మూ కాశ్మీర్‌లో 2 స్థానాలకు ఈ దశలోనే ఎన్నిక జరగనుంది. ఐదో విడతలో దేశవ్యాప్తంగా 674మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 51 సీట్లలో మొత్తం 8, 75, 88,722 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

బరిలో పలువురు ప్రముఖులు

బరిలో పలువురు ప్రముఖులు

ఐదో దశ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సోనియా బరిలో నిలిచిన రాయ్ బరేలీ, కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ పోటీ చేస్తున్న అమేథీ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బరిలో నిలిచిన లక్నో, బీజేపీ అభ్యర్థి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కాంగ్రెస్ క్యాండిడేట్ కృష్ణ పునియా ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్న జైపూర్ రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ దఫాలోనే వారి అదృష్టాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం

51 స్థానాల్లో పోలింగ్ ఉదయం 7గం. నుంచి సాయంత్రం ఆరింటి వరకు కొనసాగనుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ భద్రత కట్టుదిట్టం చేసింది. మొదటి నాలుగు దశల్లో హింసాత్మక ఘటనలు జరిగిన బెంగాల్‌లో ఈసారి అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలతో పహరా ఏర్పాటుచేయనున్నారు.

English summary
Elaborate arrangements have been made for peaceful conduct of fifth phase of Lok Sabha elections tomorrow. 51 Lok Sabha constituencies will vote in the Lok Sabha Election 2019 on 6 May. Voting will take place in some seats of Bihar, Jammu and Kashmir, Jharkhand, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and West Bengal. Rae Bareli and Amethi Lok Sabha seats in Uttar Pradesh will be among the most watched contests between BJP and Congress in Phase 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X