వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు వోటర్ ఐడి కార్డులు: కిరణ్ బేడీకి ఈసి క్లిన్‌చిట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు వేర్వేరు చిరునామాలపై రెండు వోటరు ఐడి కార్డులున్నాయనే వివాదంపై బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి ఎన్నికల కమిషన్ (ఈసి) క్లీన్‌చిట్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెసు బుధవారం ఉదయం డిమాండ్ చేశాయి. అయితే, ఆ వివాదంపై మాట్లాడడానికి కిరణ్ బేడీ నిరాకరించారు. కిరణ్ బేడీకి ఒకే వోటర్ ఐడి కార్డు ఉందని, దాని నెంబర్ టిజడ్‌డి1656909 అని ఈసి తెలిపింది.

ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయనే విషయంపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించింది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ఉదయ్ పార్క్, తాల్ కటోరా లేన్ అడ్రసులతో రెండు వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి.

Election Comission gives clean chit to Kiran Bedi in double voter ID cards row

ఈ విషయమై పిటిఐ వార్తా సంస్థ కిరణ్ బేడీని ప్రశ్నించగా - మాట్లాడడానికి నిరాకరించారు. ఈ సమస్య గురించి తమకు తెలుసునని, తాల్ కటోరా లేన్ అడ్రసుతో ఉన్న మొదటి డాక్యుమెంట్‌ను తొలగించమని కోరుతూ ఆమె దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి వస్తామని ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

తన రెండు కార్డుల్లో ఒకదాన్ని రద్దు చేయాలని కోరుతూ కిరణ్ బేడీ దరఖాస్తు చేయకుండా ఉండి ఉంటే ఆమెపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉందని ఆ అధికారి సూచనప్రాయంగా తెలియజేశారు. కిరణ్ బేడీకి జారీ అయిన రెండు కార్డుల్లో ఉదయ్ పార్కు చిరునామాతో ఉన్న కార్డుపై ‘టిజడ్‌డి 1656909' ఓటరు ఐడి నంబరు ఉంది. అలాగే నంబర్ 2, తాల్‌కటోరా లేన్ అడ్రసుతో ఉన్న మరో కార్డుపై ‘ఎస్‌జెఇ 0047969' నంబరు ఉంది. నామినేషన్ పత్రాల్లో కిరణ్ బేడీ తన నివాసం అడ్రసుగా ఉదయ్ పార్కును పేర్కొన్నారు.

English summary
The Election Commission on Thursday gave a clean chit to BJP's chief ministerial candidate Kiran Bedi, who recently faced flak for holding two voter identity cards with separate addresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X