వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఆట మొదలైంది: అన్నాడీఎంకే వర్గాలకు గడువు పూర్తి ! ఎవరికి ?

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భారత ఎన్నికల కమిషన్ పన్నీర్ సెల్వం, శశికళ వర్గానికి చెందిన వారితో చర్చించారు. ఇరు వర్గాలకు ఎన్నికల కమిషన్ 90 నిమిషాలు సమయం కేటాయించడంతో పార్టీ చిహ్నం ఎవరికి వస్తుందా ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు వర్గాలకు ఈ రోజు చావు బతుకుల సమస్య ఎదురైయ్యింది. రెండాకుల గుర్తు ఎవరికి వస్తోందో అంటూ ఇరు వర్గాలు టెన్షన్ తో హడలిపోతున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ చిహ్నం ఎవరికి వస్తుందా ? అంటూ టెన్షన్ పడుతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భారత ఎన్నికల కమిషన్ పన్నీర్ సెల్వం, శశికళ వర్గానికి చెందిన వారితో చర్చించారు. ఇరు వర్గాలకు ఎన్నికల కమిషన్ కేవలం 1.30 గంటలు ( 90 నిమిషాలు) సమయం కేటాయించారు.

Election commission allots One and half hours for each group of AIADMK, says sources.

ఆ సమయంలో పన్నీర్ సెల్వం వర్గీయులు, శశికళ వర్గీయులు వారి వాదనలు ఎన్నికల కమిషన్ ముందు వినిపించుకున్నారు. రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలంటే, మాకే ఇవ్వాలని రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించారు.

అయితే ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్నికల కమిషన్ చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ టెన్షన్ మొదలైయ్యింది. రెండాకుల చిహ్నం మాకే వస్తోందని రెండు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఈ రోజు తీసుకునే నిర్ణయం ఏ వర్గానికి షాక్ ఇస్తోందో అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

English summary
Tamil Nadu: Panneerselvam VS Sasikala, Election commission allots One and half hours for each group of AIADMK, says sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X