వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపో మాపో లోక్‌ సభ ఎన్నికల ప్రకటన.. 8 దశల్లో పోలింగ్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌ సభ ఎన్నికల సమరం మొదలు కానుంది. రేపో మాపో ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయా పార్టీలు.. ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. లోక్‌ సభ ఎలక్షన్లకు సంబంధించి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెల్లడించే ఛాన్సుంది. కుదిరితే ఆదివారం లోపే రావొచ్చు.. లేదంటే మంగళవారంలోగా ప్రకటన వెలువడనుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దానికి కావాల్సిన ప్రైమరీ ప్రాసెస్ పూర్తయిందని.. ఎన్నికల తేదీలు ప్రకటించడమే తరువాయి అంటున్నారు.

మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్

ఏప్రిల్ చివరివారం నుంచి మే మొదటి రెండు వారాల వరకు ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలు ప్రకటించనుంది. 7 లేదా 8 దశల్లో పోలింగ్ నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. తొలి దశ పోలింగ్ కు సంబంధించి మార్చి నెల చివర్లో ప్రకటన విడుదల చేసి.. ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎలక్షన్లు నిర్వహించనుంది సెంట్రల్ ఈసీ.

 Election Commission to announce Lok Sabha elections soon

2014లో 16వ లోక్‌ సభ మే 31వ తేదీ లోపు కొలువుదీరాల్సి ఉంది. అందుకే అప్పట్లో మార్చి 5వ తేదీనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. అయితే ఇప్పుడు అది జూన్ 3 కు మారినందున.. 2019 ఎన్నికల షెడ్యూల్ విడుదలలో కాస్తా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Election Commission to announce Lok Sabha elections soon. Elections may be conducted in 8 phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X