వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు: డేట్ ఫిక్స్ చేసిన ఎన్నికల కమిషన్, అప్పుడే వేడి, నువ్వానేనా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక విధాన పరిషత్ ఎన్నికల (ఎమ్మెల్సీ) తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 11వ తేదీ కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఖాళీ అవుతున్న 11 ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మే 22వ తేది మంగళవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో పదవుల కోసం నాయకులు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు.

ఎమ్మెల్యేల ఓటు

ఎమ్మెల్యేల ఓటు

జూన్ 11వ తేదీ ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. 11 ఎమ్మెల్సీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించడంతో కర్ణాటకలో మరోసారి ఎన్నికల వేడి మొదలైయ్యింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపించుకుంటారు. 2018 శాసన సభ ఎన్నికల తరువాత శాసన సభలో ఎమ్మెల్యేల బలాబలాలు ఇలా ఉన్నాయి. బీజేపీ-104, కాంగ్రెస్-78, జేడీఎస్-37.

ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల షెడ్యూల్

  • మే 24వ తేదీ నుంచి నామినేషన్లు
  • మే 31వ తేదీ నామినేషన్లు వెయ్యడానికి చివరి రోజు
  • జూన్ 4వ తేదీ నామినేషన్లు ఉపసంహరణ
  • జూన్ 11 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటన
  • ఎమ్మెల్సీలు

    ఎమ్మెల్సీలు

    కర్ణాటక విధాన పరిషత్ లో 11 మంది ఎమ్మెల్సీలు పదవి విరమణ పొందుతున్నారు. బీజేపీ-5, కాంగ్రెస్-5, జేడీఎస్-1 ఖాళీ అవుతున్నాయి. విధాన పరిషత్ లో ఖాళీ అయిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 11వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి.

    బీజేపీ ఎమ్మెల్సీలు

    బీజేపీ ఎమ్మెల్సీలు

    2018 జూన్ 17వ తేదీన బీజేపీకి చెందిన ఎమ్మెల్సీలు బిజే. పుట్టస్వామి, డీఎస్. వీరయ్య, సోమణ్ణ బేవినమదర్, రఘనాథ్ రావ్ మల్లాపుర, భానుప్రకాష్ పదవి విరమణ చేస్తున్నారు.

    కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్సీలు

    కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్సీలు

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సీఎం. ఇబ్రహీం, ఎంఆర్. సితారామ్, మోటమ్మ, కే. గోవిందరాజు, భైరతి సురేష్ పదవి విరమణ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్సీ సయ్యద్ మదిర్ పదవి విరమణ చేస్తున్నారు.

English summary
Election Commission announced date for legislative council election. Election will be held on June 11, 2018 to elect 11 members from Karnataka assembly. Result will be announced on the same day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X