వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఎన్నికలు ఇలా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి రానుందని ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ స్పష్టం చేశారు.

ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో 16కోట్ల మంది ఓటర్లు ఎన్నికల ఔటింగ్‌లో పాల్గొననున్నారు. ఐదు రాష్ట్రాల్లో లక్షా 85వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 Election Commission announced poll dates for UP, Punjab, Goa, Manipur and Uttarakhand today

యూపీలో 403 స్థానాలకు, పంజాబ్‌లో 117, గోవా 40, ఉత్తరాఖండ్ 90, మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భారీ శబ్ధం వచ్చే మైకులను వాడరాదని స్పష్టం చేశారు. ఉదయం 6గంటలకు ముందు, రాత్రి 10గంటల తర్వాత ఇలాంటి మైకులు ఉపయోగిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు.

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఈసీ పేర్కొంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓటర్లకు స్లిప్పులను ఎన్నికల సంఘమే పంపిణీ చేస్తుందని తెలిపారు. మొదటిసారిగా బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి ఫొటో చేర్చుతున్నట్లు తెలిపారు.

ఎన్నికల కమిషన్ కూడా సోషల్ మీడియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. పలువురు రాజకీయ నాయకులకు సొంత టీవీ ఛానళ్లు ఉన్నాయని, ఏ ఛానెళ్లయితే వారి గురించే ప్రత్యేకంగా ప్రచారం చేస్తాయో వాటిపై కూడా నిఘా ఉంటుందని, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

కొత్త ఓటర్లకు కూడా ఫోటో గుర్తింపు కార్డులు జారీచేస్తామని, అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వినియోగిస్తామని తెలిపారు. నోటా అమల్లో ఉంటుందని చెప్పారు. ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కాగా, మార్చి 11న ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ జైదీ తెలిపారు.

ఒకే ఫేజ్‌లో గోవా ఎన్నికలు

నోటిఫికేషన్ -జనవరి11
నామినేషన్ చివరి తేది-జనవరి 18
నామినేషన్ల పరిశీలన-జనవరి 19
ఉపసంహరణ- జనవరి 21
ఎన్నికలు- ఫిబ్రవరి 4

ఉత్తర్‌ప్రదేశ్‌
403 స్థానాల్లో 7 విడతలుగా పోలింగ్‌
తొలి విడత : ఫిబ్రవరి 11(73స్థానాలు)
రెండో విడత: ఫిబ్రవరి 15(67 స్థానాలు)
మూడో విడత: ఫిబ్రవరి 19(69 స్థానాలు)
నాలుగో విడత: ఫిబ్రవరి 23(53 స్థానాలు)
ఐదో విడత: ఫిబ్రవరి 27( 52 స్థానాలు)
ఆరో విడత: మార్చి 4(49 స్థానాలు)
ఏడో విడత: మార్చి 8( 40 స్థానాలు)

పంజాబ్‌
నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 11
పోలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 4

మణిపూర్‌
రెండు విడతల్లో పోలింగ్‌
తొలి విడత : మార్చి 4(38స్థానాలు)
రెండో విడత మార్చి 8(22 స్థానాలు)

ఉత్తరాఖండ్‌
నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 20
పోలింగ్‌ తేదీ: మార్చి 15

English summary
The Election Commission will on Wednesday announced the poll dates for elections to five state assemblies – Uttar Pradesh, Punjab, Manipur, Goa and Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X