వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు...డబ్బు..డబ్బు.. ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, డ్రగ్స్ రూ 3370

|
Google Oneindia TeluguNews

ఎన్నికలంటే ధనం..ధనం లేనిదే బయట అడుగు పెట్టలేని పరిస్థితి..అలాంటీది అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చుపెడతారు..తమకు అందినకాడికి తెచ్చి పంచుతారు. ఎన్నికల నిబంధనలు కాదని ఓక్కో నియోజవర్గంలో కోట్లాది రుపాయల ధనం ఖర్చవుతుంది..అందుకు అభ్యర్థులను కట్టడి చేసేందుకు ఎన్నికల కమీషన్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది..ఎవరు డబ్బులు పంచకుండా జాగ్రత్త చర్యలు తీసుకునే ఉంటుంది. అయినా రాజకీయ నాయకుల డబ్బు పంపిణిమాత్రం ఆగడం లేదు...అయితే ఈ ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ నిర్వహించిన తనీఖీల్లో ఎంత డబ్బు పట్టుబడింది. నగదుతోపాటు మద్యం ఏ రాష్ట్ర్రాల్లో ఎక్కువ పట్టుబడ్డాయి..?

3370 కోట్ల రుపాయల నగదు, మద్యం ,డ్రగ్స్ పట్టివేత

3370 కోట్ల రుపాయల నగదు, మద్యం ,డ్రగ్స్ పట్టివేత

ప్రస్థుతం జరుగుతున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమీషన్న నిర్వహించిన తనిఖీల్లో రూ.3370 కోట్ల రుపాయాల నగదు మద్యం ,డ్రగ్స్ పట్టుపడ్డాయి..ఇందులో నగదు రూపంలో లభించిన డబ్బు 812 కోట్లు, కాగా మిగతావి డ్రగ్స్ ,మద్యం రూపంలో ఉన్నాయి.ఇక గత ఎన్నికల్లో మాత్రం 303 కోట్ల రుపాయల నగదు పట్టుబడింది..దీంతో అప్పటితో పోలిస్తే చాలా రేట్లు ఎక్కువ ఈ ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టారని భావించవచ్చు. కాగా మొత్తం లభించిన నగదులో కేవలం తమిళనాడులోనే 935 కోట్ల విలువైన నగదు,మద్యం పట్టుపడింది.

ఆంక్షలు ఎత్తివేయడంతో డబ్బుల వరద

ఆంక్షలు ఎత్తివేయడంతో డబ్బుల వరద

కాగా రాజకీయ పార్టీలకు కార్పోరేట్ కంపనీలు ఇచ్చే విరాళలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆక్షలను ఎత్తివేసింది. దీంతో రాజకీయ పార్టీలకు ఊరు పేరు లేకుండా నిధులు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు కార్పోరేట్ సంస్థలు ఎలక్ట్రోరల్ బాండులు తీసుకుని రాజకీయ పార్టీలకు ఇవ్వోచ్చనే విధానాన్ని తీసుకురావడం వల్ల గత మార్చి నెలల్లోనే 3600 కోట్ల రుపాయలు బాండ్స్ అమ్ముడు పోయాయి. దీంతో రాజకీయ పార్టీలకు నిధులు వరదాలా వచ్చి చేరాయి.

మొత్తం ఎన్నికల్లో సుమారు 17 కోట్ల ఖర్చు

మొత్తం ఎన్నికల్లో సుమారు 17 కోట్ల ఖర్చు

ఇక ఎన్నికల్లో పట్టుపడిన డబ్బు రాజకీయ నాయకులు ఖర్చుపెట్టే దాంట్లో కనీసం ఇరవై శాతం కూడ ఉండదనేది ఎన్నికల కమీషన్ అంచనా వేస్తోంది. ఇప్పుడు లభించిన డబ్బుతో లెక్కలు వేసుకుంటే మొత్తం రాజకీయ పార్టీలు పెట్టే డబ్బు సుమారు 17 వేల కోట్ల రుపాయలు ఉంటుందనేది ఒక అంచనా ఇంతపెద్ద మొత్తం డబ్బులు ఖర్చుపెట్టిన నాయకులు వాటిని తిరిగి సంపాదించుకోవడంతోపాటు వాళ్లకు పెట్టుబడి పెట్టిన కంపనీలు సైతం ఏదో ఒకటి ఆశిస్తారు.ఇలా ప్రజల సోమ్మును ప్రజలకే ఖర్చు పెట్టి ఎన్నికల్లో లబ్ది పోందుతుంది మాత్రం రాజకీయ పార్టీలే అని చెప్పవచ్చు.

పట్టుకున్న డబ్బును తిరిగి ఇయ్యడమే...

పట్టుకున్న డబ్బును తిరిగి ఇయ్యడమే...

ఇంతపెద్ద వ్యవస్థలో ఎన్నికల కమీషన్ పట్టుకున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే తిరిరి ఎవరిదగ్గరైతే తీసుకున్నామో మళ్లి వారికే వెళ్లనుంది..ముందుగా డబ్బును పట్టుకున్న ఎన్నికల కమీషన్ ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుతుంది. అయితే కేంద్రం మాత్రం పట్టుపడిన డబ్బును తిరిగి వారికే ఇస్తామని ఏకంగా సుప్రిం కోర్టుకే స్పష్టం చేసింది. దీంతోపాటు అసలు కేసులు కూడ చూసి చూడనట్టే పెడతామని కూడ స్పష్టం చేశాయి. ఎందుకంటే ఎన్నికల్లో పట్టుపడిన డబ్బుకు సంపాదించి విచారించి వారికి శిక్షలు వేసే వ్యవస్థలు ఎన్నికల అనంతరం పెద్దగా పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని పలువురు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడంతో వారి డబ్బును తిరిగి ఇచ్చి వేసే అనవాయితి వస్తుంది. ఎన్నికల్లో డబ్బు ఎంత పట్టుకున్న ఫలితాలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి.

English summary
The cash and drugs of worth Rs 3370 crore were caught conducted by the Election Commission as part of the on going Lok Sabha polls, in this Rs 812 crore cash rest were drugs and alcohol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X