వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుమలత కోరుకున్న ఎన్నికల గుర్తు, ఈసీ ఇచ్చిన గుర్తు, సమరానికి సై, నువ్వానేనా, ఫ్యాన్స్ హ్యాపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష్ సతీమణి సుమలతకు ఎన్నికల కమిషన్ ఎన్నికల గుర్తు కేటాయించింది. సుమలత కోరుకున్న గుర్తుల్లో ఓ గుర్తు ఈసీ కేటాయించడంతో అంబరీష్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

శాంతిని కాపాండండి, వాటిని పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, చాలెంజింగ్ స్టార్!శాంతిని కాపాండండి, వాటిని పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, చాలెంజింగ్ స్టార్!

స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తాను కోరుకున్న వాటిల్లో ఒకటి ఎన్నికల గుర్తు కేటాయించాలని సుమలత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. అయితే సుమలత సూచించిన వాటిలోని ఓ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించడంతో అంబరీష్ అభిమానులు, అనుచరులు ఉత్సాహంగా సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

మూడు గుర్తులు

మూడు గుర్తులు

మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు తాను కోరుకున్న గుర్తుల్లో ఒకటి కేటాయించాలని సుమలత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. ఎద్దులను పట్టుకుని ఉన్న రైతు గుర్తు, చెరుకు తోట గుర్తు, తలకు పాగ చుట్టుకుని సమరశంఖం ఊదుతున్న వ్యక్తి గుర్తుల్లో ఒకటి కేటాయించాలని సుమలత ఎన్నికల అధికారులకు మనవి చేశారు.

గుర్తు మారింది

గుర్తు మారింది

ఎన్నికల అధికారులు మొదట సుమలతకు తోపుడు బండి గుర్తు కేటాంచారు. లక్కీ డ్రా పద్దతిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. అయితే చివరికి తలకు పాగా చూట్టుకుని సమరశంఖం ఊదుతున్న వ్యక్తి గుర్తు లక్కీ డ్రాలో ఎవ్వరికి రాకపోవడంతో దానిని ఎన్నికల అధికారులు సుమలతకు కేటాయించారు.

 జేడీఎస్ VS సుమలత

జేడీఎస్ VS సుమలత

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి, స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో మొత్తం 22 మంది పోటీలో ఉన్నారు. రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత పేరుతో మరో ఇద్దరు సుమలతలు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఈవీఎంలో ఫోటోలు

ఈవీఎంలో ఫోటోలు

సుమలత కోరకున్న ఎన్నికల గుర్తు రావడంతో వాటిని కరపత్రాల్లో ముద్రించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తు, పోటీ చేస్తున్న అభ్యర్థి ఫోటో ఉంటుంది. సుమలత ఫోటో, ఎన్నికల గుర్తు ఉన్నందున సుమలత కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

చాల సంతోషం

చాల సంతోషం

తమ నాయకురాలు కోరుకున్న గుర్తుల్లో ఒక గుర్తు ఎన్నికల అధికారులు కేటాయించడంతో సుమలతతో పాటు ఆమె అనుచరులు సంతోషంగా ఉన్నారు. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, సుమలత అంబరీష్ శక్తివంచన లేకుండా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 22 మంది అభ్యర్థుల్లో సుమలత, నిఖిల్ కుమారస్వామి మధ్య గట్టిపోటీ ఉంది. మండ్యలోని బీజేపీ నాయకులు సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లోని ఒక వర్గం నిఖిల్ కుమారస్వామికి, మరో వర్గం సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

English summary
Election commission gives election symbol for Sumalatha Ambareesh, She is contesting from Mandya lok sabha constituency against CM's son Nikhil Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X