వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.28 లక్షలకు రూ.4 కోట్లు, రూ.20 లక్షలకు రూ.కోటి ఖర్చు, వివరణ ఇవ్వాలని ఈసీ ఇలా...

ఎన్నికల నియమావళికి విరుద్దంగా విచ్చలవిడిగా ఎన్నికల్లో డబ్బులను ఖర్చు చేసిన ఇద్దరు అభ్యర్థులకు ఎన్నికల కమీషన్ నోటీసులను పంపింది. ఈ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆధేశాలను జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఎన్నికల నియమావళికి విరుద్దంగా విచ్చలవిడిగా ఎన్నికల్లో డబ్బులను ఖర్చు చేసిన ఇద్దరు అభ్యర్థులకు ఎన్నికల కమీషన్ నోటీసులను పంపింది. ఈ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆధేశాలను జారీ చేసింది.

ఓ జాతీయ మీడియా చానల్ అభ్యర్థుల ఖర్చుపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్టింగ్ ఆపరేషన్ లో అభ్యర్థులు ఏ రకంగా డబ్బులను ఖర్చు చేసింది పూసగుచ్చినట్టు వివరించారు.

ఈ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా నియమాలకు విరుద్దంగా డబ్బులను ఖర్చుచేసిన అభ్యర్థులను వివరణ కోరింది ఎన్నికల సంఘం..48 గంటల లోపుగా ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశిందిచింది.

Election commission issued notices to candidates for over expenditure

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం 28 లక్షలను ఖర్చు చేయాల్సి ఉంది.అయితే ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డబ్బులను ఖర్చు చేశాడు. అయితే ఎన్నికలు పూర్తయ్యేనాటికి తన ఖర్చు సుమారు 5 కోట్లను మించిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో టిక్కెట్టు ఖరారైన రోజు నుండి ఇప్పటివరకు అతను రూ.4 కోట్ల రూపాయాలను ఖర్చు చేసినట్టు చెప్పారు.ఎన్నికలు పూర్తయ్యేనాటికి మరో కోటి రూపాయాలు ఖర్చు కానుందని చెప్పారు. ప్రతి రోజూ తన ప్రచారం కోసం కనీసంగా రూ.5 లక్షల రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

ఇక మణిపూర్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న అభ్యర్థి రూ.20 లక్షలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాని, మణిపూర్ నుండి పోటీ చేస్తోన్న ఓ పార్టీకి చెందిన అభ్యర్థి మాత్రం తీవ్రంగా డబ్బులను ఖర్చు చేస్తున్నట్టుగా స్టింగ్ ఆపరేషన్ లో తేటతెల్లమైంది.

38 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ రాష్ట్రంలో కూడ బరిలో ఉన్న అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇప్పటికే రూ.1.02 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.2 కోట్లు తన చేతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. 2007 లో అదే అభ్యర్థి రూ.4 కోట్ల రూపాయాలను ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ దఫా రూ.ఐదు కోట్లను ఖర్చు చేస్తే మణిపూర్ రాష్ట్రంలో విజయం తథ్యమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

ఓ జాతీయ మీడియా ఛానల్ ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా అభ్యర్థులు ఏ రకంగా డబ్బులను ఖర్చు చేస్తున్నారో వెల్లడించింది. ఈ స్టింగ్ ఆపరేషన్ కథనాలను చూసిన ఎన్నికల కమీషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఇద్దరు అభ్యర్థులకు నోటీసులను జారీ చేసింది.

English summary
In Uttar Pradesh, the Election Commission has kept campaign spending at Rs 28 lakh per candidate.Like this I have spent more than Rs 4 crore from the day I started fighting this election said a candidate from uttar pradesh.The Election Commission of India had set the campaign expenses limit per candidate between Rs 20 lakh and Rs 28 lakh in the five states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X