వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలి,ఆర్ బి ఐ కి ఈసీ మొట్టికాయలు

నగదు ఉప సంహరణ పరిమితిని పెంచాలని ఎన్నికల కమీషన్ కోరినా ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తిరస్కరించడంపై ఎన్నికల కమీషన్ మండిపడింది.ఈ విషయమై మరో లేఖ రాసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:నగదు ఉప సంహరణ పరిమితిని పెంచాలని ఎన్నికల కమీషన్ కోరినా ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తిరస్కరించడంపై ఎన్నికల కమీషన్ మండిపడింది.ఈ విషయమై మరో లేఖ రాసింది.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల వేళ పోటీచేసే అభ్యర్థులకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి.

అయితే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని ఎన్నికల కమీషన్ ఆర్ బి ఐ కి లేఖ రాసింది.

అయితే ఎన్నికల కమీషన్ లేఖ రాసినా కాని, ఆర్ బి ఐ నుండి సానుకూలంగా స్పందించలేదు.ఆర్ బి ఐ తీరుపై ఎన్నికల కమీషన్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.

నగదు పరిమితి పెంచాలని లేఖ

నగదు పరిమితి పెంచాలని లేఖ

దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి . ఎన్నికల వేళ పోటీచేస్తోన్న అభ్యర్థులకు విపరీతమైన ఖర్చులుంటాయి.అయితే నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని ఎన్నికల కమీషన్ ఆర్ బి ఐ లేఖ రాసింది.అయితే నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలనే ప్రతిపాదనను ఆర్ బి ఐ తిరస్కరించింది. దీంతో ఎన్నికల కమీషన్ ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశాడు. నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని కోరారు. ఈ మేరకు మరో లేఖ రాశాడు.

ఆర్ బి ఐ కి మొట్టికాయలేసిన ఎన్నికల కమీషన్

ఆర్ బి ఐ కి మొట్టికాయలేసిన ఎన్నికల కమీషన్

నగదు ఉపసంహరణ పరిమితులను ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా ఉండకూడదని ఈసీ ఆర్ బి ఐని మొట్టికాయలేసింది. ఆర్ బి ఐ తీరును ఎన్నికల కమీషన్ తప్పుబట్టింది. చట్ట బద్దమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థుల వ్యయం కోసం ఉపసంహరణ పరిమితి అడ్డంకిగా ఉండకూడదన్నారు.ప్రస్తుతమున్న వారానికి 24 వేల రూపాయాలను ఉపసంహరించుకోవచ్చు.అయితే దాన్ని 2లక్షలకు పెంచాలని ఈసీ తేల్చి చెప్పింది.

ఆర్ బి ఐ తొందరపాటు చర్య

ఆర్ బి ఐ తొందరపాటు చర్య

ఆర్ బి ఐ తొందరపాటుకు పాల్పడుతోందని ఈసీ అభిప్రాయపడుతోంది.అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థి కనీసం 28 లక్షల రూపాయాలు ఖర్చుచేయవచ్చు. అయితే వారానికి రెండు లక్షల రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే అవకాశం ఇవ్వాలని ఈసీ కోరింది.అయితే ఆర్ బి ఐ మాత్రం ససేమిరా అంటోంది.ఈ విషయమై తాము చేసిన వినతిని పట్టించుకోవడం లేదని చెబుతోంది. ఆర్ బి ఐ తొందరపాటుకు పాల్పడుతోందని ఈసీ అభిప్రాయపడింది.

అభ్యర్థుల నుండి ఫిర్యాదులు

అభ్యర్థుల నుండి ఫిర్యాదులు

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని పలు సార్లు విన్నవించారు. ఈ మేరకు ఈసీకి పెద్ద ఎత్తున అభ్యర్థుల నుండి వినతులు వస్తున్నాయి.దీంతో ఈసీ ఆర్ బి ఐ కి లేఖ రాసింది.అయితే పోటీచేసే అభ్యర్థులు ఖర్చుచేసేది ఎక్కువైనా, ఎన్నికల కమీషన్ చూపే లెక్కలు మాత్రం తక్కువగా ఉంటాయి. అయితే నగదు ఉపసంహరణ పరిమితిని పెంచితే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు వెసులుబాటు ఉండే అవకాశం లేకపోలేదు.

English summary
after the rbi turned down its request to increase the weekly cash withdrawal limit for candidates contesting in the coming assembly polls, the election Commission of india has written back to rbi governor Urjit Patel, expressing “serious concern about the cursory manner in which the issue has been dealt with”. In a letter on Sunday, ec asked rbi to realise the ‘gravity of the situation’, virtually charging the central bank with impeding the democratic process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X