వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ లు బదిలి: కర్ణాటక ప్రభుత్వానికి మొటిక్కాయ వేసిన ఎన్నికల కమిషన్, స్టే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నిజాయితీగా పని చేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుుడు పరిష్కరిస్తున్న సిన్సియర్ అధికారుల బదిలిల విషయంలో అత్యుత్సాహం చూపించిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భారత ఎన్నికల కమిషన్ మొటిక్కాయ వేసింది.

రోహిణి సింధూరి

రోహిణి సింధూరి

హాసన్ జిల్లాధికారి (కలెక్టర్) రోహిణి సింధూరి దాసరితో సహ ఏడు మంది ఐఏఎస్ అధికారులను బదిలి చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అభివృద్ది పనులు, ప్రజల సమస్యల విషయంలో రాజీపడకుండా పని చేస్తున్న రోహిణి సింధూరి దాసరి బదిలిని హాజన్ జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

జిల్లాలో ఆందోళన

జిల్లాలో ఆందోళన

మంగళవారం హాసన్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించి రోహిణి సింధూరి దాసరి బదిలిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు అయినా కర్ణాటక ప్రభుత్వం మాత్రం ప్రజల డిమాండ్ ను పట్టించుకోలేదు.

నిత్యం వివాదాలు

నిత్యం వివాదాలు


రోహిణి సింధూరి దాసరి స్థానంలో ఐఏఎస్ అధికారి ఎంవీ. వెంకటేష్ ను నియమించారు. కర్ణాటక ప్రభుత్వం నిత్యం సిన్సియర్ అధికారుల విషయంలో బదిలి అస్త్రం ప్రయోగిస్తోందని, వారిని సక్రమంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

 ఎన్నికల కమిషన్ ఎంట్రీ !

ఎన్నికల కమిషన్ ఎంట్రీ !

ఏడు మంది ఐఏఎస్ అధికారుల ఆకస్మిక బదిలి విషయంలో భారత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. ఐఏఎస్ అధికారుల బదిలిని నిలిపివేయాలని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఇప్పుడు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అక్కడే విధులు నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ సూచిస్తూ బదిలీలపై స్టే విధించింది.

ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు


2018 మే 28వ తేదీ వరకూ ఐఏఎస్ అధికారులతో పాటు ఏ అధికారులను బదిలి చెయ్యరాదని, ఒక వేళ బదిలి చెయ్యాల్సి వస్తే వాటి కారణాలు ఏమిటి అని మా దృష్టికి తీసుకురావాలని భారత ఎన్నికల కమిషన్ అధికారి సంజీవ్ కుమార్ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభాకు లేఖ రాశారు.

English summary
Election Commission has given stay to Government order Transfer of Rohini Sindhuri and 6 IAS officers till May 28, 2018. Karnataka likely to go on polls during the month of May and more than 80 IAS rank officers service is utilized
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X