వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఒక అభ్యర్థి.. ఒకే నియోజకవర్గం' ప్రతిపాదనకు ఈసీ మద్దతు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

'ఒక అభ్యర్థి.. ఒకే నియోజకవర్గం' ప్రతిపాదనకు ఈసీ మద్దతు..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలంతా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సీఎం అభ్యర్థులు,ప్రధాని అభ్యర్థులు ఈ పద్దతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థి పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుమతించరాదని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్వని కుమార్‌ ఉపాధ్యాయ్‌ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
అభ్యర్ధులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్న ప్రజా ప్రాతినిథ్య చట్టంలో సెక్షన్‌33(7)ను సవరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

 Election Commission tells Supreme Court it supports one candidate, one seat

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. గతేడాది డిసెంబర్‌లో పిటిషన్‌కు బదులివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించింది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ తమ అఫిడవిట్‌లో పేర్కొంది.

కాగా, గతంలో ఈ పిటిషన్ పై స్పందిస్తూ.. ఒక అభ్యర్థి పలు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఉపఎన్నికలు అనివ్యారమవుతున్నాయని సుప్రీం పేర్కొంది. వ్యయప్రసయాలతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే, గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వదోదర, యూపీలోని వారణాసి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండు స్థానాల్లో గెలుపొందిన ఆయన వడోదర నియోజకవర్గాన్ని వదులుకోవడంతో మూడు నెలలకే అక్కడ ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

English summary
The Election Commission has told the Supreme Court that it supports the proposal to allow one candidate to contest from only one constituency in an election. The EC expressed this view in an affidavit it filed in the petition over the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X