వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పార్టీ: నేడే ఈసీ తీర్పు, పళని, పన్నీర్ వర్గాల్లో, చిన్నమ్మ వర్గంలో టెన్షన్ టెన్షన్?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే విషయంపై నవంబర్ 23వ తేదీ గురువారం భారత ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటున్నది. అన్నాడీఎంకే పార్టీకి నిజమైన వారసులు ఎవరు ? అనే విషయం ఎన్నికల కమిషన్ ఈ రోజు తేల్చి చెప్పడానికి సిద్దం అయ్యింది.

జయలలిత ఇంటి దగ్గర టీటీవీ దినకరన్ అనుచరుల హంగామా, అడ్డుకున్న పోలీసులు!జయలలిత ఇంటి దగ్గర టీటీవీ దినకరన్ అనుచరుల హంగామా, అడ్డుకున్న పోలీసులు!

అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సందర్బంలో భారత ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రెండాకుల చిహ్నాన్ని తాత్కలికంగా రద్దు చేసింది. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం, శశికళ వర్గం భారత ఎన్నికల కమిషన్ ముందు వారి వాదనలు వినిపిస్తున్నారు. మూడు నెలల క్రితం పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు కలిసిపోయాయి.

Election Commission will deliver the verdict today the AIADMK's two leaves symbol case.

పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం అయిన తరువాత అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను శాస్వతంగా బహిష్కరిస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అప్పటి నుంచి రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని లేదు మాకే ఇవ్వాలని శశికళ వర్గం, తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇదే సాక్షం, ఇది ప్రారంభం, కేసు పెడుతారా: కమల్ హాసన్!తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇదే సాక్షం, ఇది ప్రారంభం, కేసు పెడుతారా: కమల్ హాసన్!

తమిళనాడు ప్రభుత్వం, శశికళ వర్గం వాదనలు వింటున్న భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు ఎవరికి వైపు ఎక్కువ మంది ఉన్నారు అనే పూర్తి వివరాలు సేకరించిన భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు తుది నిర్ణయం తీసుకోవాలని సిద్దం అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం తమిళనాడు ప్రభుత్వానికి వెలుతుందా ? శశికళ వర్గానికి వెలుతుందా అంటూ ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైయ్యింది.

English summary
Election comission of India may announce the final judgement today for whoom the AIADMK party name and two leaves symbol either to Edappadu Palanisamy faction or Sasikala faction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X