India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార‌త్ లో ఎన్నికలు...! చూసేందుకు మోజుప‌డుతున్న విదేశీయులు..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైద‌రాబాద్ : సాధార‌ణంగా భార‌త సంస్క్రుతిలో భాగంగా జ‌రుపుకునే పండుగ‌ల‌ను చూసేందుకు విదేశీయులు ఆస‌క్తిక‌న‌బ‌రుస్తుంటారు. హోళీ, వినాయ‌క‌చ‌వితి, బ‌తుక‌మ్మ‌, కోండి పందాలు, దీపావ‌ళి వంటి వేడేక‌ల‌ను చూసేంద‌కు విదేశీయులు భార‌త్ వ‌స్తూంటారు. భార‌త దేశ సంస్క్రుతి, సాంప్ర‌దాయాల‌ను చూసి ముగ్దులౌతుంటారు. కాని ఈ సారి జ‌రుగుతున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను చూసేందుకు సైతం విదేశీయులు ఆస‌క్తి చూపించ‌డం విశేషం.లోక్ సభ ఎన్నికల వేళ భార‌త్ లో 'ఎలక్షన్ టూరిజం' జోరందుకుంది. దునియాలోనే అతి పెద్ద డెమోక్రటిక్ ఈవెంట్ ను కళ్లారా చూడరమ్మంటూ విదేశీయులకు ఆహ్వానం పలుకుతున్నాయి పలు ట్రావెల్ ఏజెన్సీలు.

 ఎన్నికలని చూసేందుకు విదేశీయుల ఆసక్తి..! స్వాగ‌తం పలుకుతున్న ట్రావెల్ ఏజెన్సీలు..!!

ఎన్నికలని చూసేందుకు విదేశీయుల ఆసక్తి..! స్వాగ‌తం పలుకుతున్న ట్రావెల్ ఏజెన్సీలు..!!

90 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా సాగుతుం దో తెలుసుకునేందుకు ఫారినర్లు కూడా ఆసక్తిచూపుతున్నారు ఇప్పటికేఇండియాలో అడుగుపెట్టిన కొన్ని బృందాలు, పలురాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల మజాను ఆస్వాదిస్తున్నాయి. వచ్చే రెండు నెలలూ ఎన్నికల సీజనే కావడంతో టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశంఉంది. సభలో పాల్గొని అభ్యర్థితో మాట్లాడొచ్చు ఎలక్షన్ టూరిజంలో భాగంగా ట్రావెల్ ఏజెన్సీలు తీరొక్క ప్యాకేజీని రూపొందించాయి. ఎన్నికలు ఏయే ప్రాంతాల్లో ఏం జరగబోతున్నాయో ముందుగా షెడ్యూల్ ను ప్రిపేర్ చేస్తారు . టూరిస్టుల ఆసక్తిని బట్టి ఎంచుకున్న ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియను చూపిస్తారు.

 జోరుగా ఎలక్షన్​ టూరిజం..! మోదీ సందేశంతో విదేశీయుల రాక..!!

జోరుగా ఎలక్షన్​ టూరిజం..! మోదీ సందేశంతో విదేశీయుల రాక..!!

పార్టీల సభలకు తీసుకెళ్లడం, వీలైతే ఎంపీ అభ్యర్థులతో మాట్లాడించడం, గ్రామీణ ఓటర్లతో ముఖాముఖీ, అర్బన్ ఓటర్లతో కలిసి ర్యాలీలు, అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ తదితర కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు . త‌క్కువ‌లో త‌క్కువ‌ మూడు రోజులు, ఎక్కువ‌గా రెండు వారాలపాటు జరిపే పర్యటనలకు ప్యాకేజీని బట్టి 40 వేల రూపాయ‌ల నుంచి 2లక్షల రూపాయ‌ల దాకా చార్జ్ వసూలు చేస్తున్నారు .గుజరాత్‌ లో మొదలై 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎలక్షన్ టూరిజం పేరుతో ట్రావెల్ ఏజెన్సీలు విదేశీయుల కోసం ప్రత్యేక ప్యా కేజీలు ప్రకటించాయి.

 విదేశీయుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్శిస్తున్న గుజ‌రాత్..! త‌ర్వాత యూపీ..!!

విదేశీయుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్శిస్తున్న గుజ‌రాత్..! త‌ర్వాత యూపీ..!!

2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎలక్షన్ టూరిజం కాన్సెప్ట్ ను ఇతర రాష్ట్రా లు కూడా ఫాలో అయ్యాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఎలక్షన్ టూరిజం బాగానే సాగిం ది. అయితే ఎన్నికల వేళ విదేశీ టూరిస్టులని ఆకట్టుకోవడంలో ఇప్పటికీ గుజరాత్ దే పైచేయి. ఈ ఎన్నికల సీజన్ లో గుజరాత్ లో పర్యటించే ఫారినర్ల సంఖ్య మూడు వేలు దాటే అవకాశంఉందని గుజరాత్ టూరిజం డెవలప్ మెంట్ సొసైటీ తెలియ‌జేస్తోంది. గుజరాత్ త‌ర్వాత విదేశీయుల్ని ఎక్కు వగా ఆకర్షించే రాష్ట్రం ​ఉత్తరప్రదేశ్.

ఎన్నికల కుంభమేళాకు రండి..! ప్ర‌చార వీడియోలో విదేశీయుల‌కు మోదీ పిలుపు..!!

ఎన్నికల కుంభమేళాకు రండి..! ప్ర‌చార వీడియోలో విదేశీయుల‌కు మోదీ పిలుపు..!!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలివి. దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే ఈ ప్రక్రియద్వారా ఇండియాలో ప్రజాస్వామ్యం ఎలాపనిచేస్తున్నదో తెల్సుకోవచ్చు. ఒకమారుమూల గ్రామానికి చెందిన ఓటరు,కేంద్రంలో ఎవరుం డాలో డిసైడ్ చేసే తీరును కళ్లారా చూడటం నిజంగా అరుదైన అవకాశం. ప్రజాస్వామ్యా న్ని నమ్మేవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇండియా ఎన్నికల కుంభమేళాకు రావాల్సిం దిగా ప్రపంచ దేశాల ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నాన‌ని, ఎలక్షన్​ టూరిజం ప్రచార వీడియోలో ప్ర‌ధాని మోడీ సందేశం అందించారు. దీనికి విదేశీయుల‌నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది.

English summary
In the Lok Sabha election, 'Election Tourism' is in full swing for the general elections. Many travel agencies are inviting foreigners to watch the biggest event in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X