వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు అంటే అందాలపోటీలు కాదు: ప్రియాంక గాంధీపై సుశీల్ మోడీ

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఎన్నికలు అంటే అందాల పోటీలు కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రియాంక త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఆమె ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తర ప్రదేశ్ తూర్పు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై సుశీల్ స్పందించారు.

ఎన్నికలు అంటే రెజ్లింగ్ పోటీలో, అందాల పోటీలో లేక ఇంకేదో పోటీ కాదని సుశీల్ మోడీ అన్నారు. ఇది రాజకీయ పోటీ అని సూచించారు. ఈ పోటీలో నాయకుల సామర్థ్యం ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు.

Election not a beauty contest: Bihar Deputy CM Sushil Modi on Priyanka Gandhis entry into politics

దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. గాంధీ కుటుంబానికి భయపడి భారతీయ జనతా పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత రాజకీయాలను ఈ కుటుంబం మలుపు తిప్పగలదని వారికి తెలుసునని అన్నారు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన పెరిగి ఇలా మాట్లాడుతున్నారన్నారు.

English summary
Bihar Deputy Chief Minister and senior BJP leader Sushil Kumar Modi has taken a dig at Priyanka Gandhi's much-reported entry into politics and said that an election is "not a beauty contest". The Bihar Deputy CM maintained that voters will cast their vote on the basis of past performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X