• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుప్రీం దెబ్బకు ఈసీ కదలిక -ఎన్నికల సంస్కరణకు ప్యానల్ ఏర్పాటు -ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీలకు నో

|

కరోనా విలయ కాలంలో సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించి తీవ్ర విమర్శలపాలై, సుప్రీంకోర్టు, హైకోర్టుల చేత చివాట్లు తిన్న ఎన్నికల సంఘం ఎట్టకేలకు వ్యవస్థాగత మార్పులపై దృష్టిసారించింది. దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల విధానంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీ) భావిస్తున్నది. అందులో భాగంగా లోటుపాట్ల‌ను గుర్తించేందుకు కోర్ ప్యాన‌ల్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠపిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా లోటుపాట్లను గుర్తించి, ఈసీ మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయాలనే దానిపై ఏర్పాటైన ఈ ప్యాన‌ల్.. ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో లోపాలను గుర్తించ‌నున్న‌ది. సెక్రటరీ జనరల్ స్థాయి నేతృత్వంలో ప‌నిచేసేలా కోర్ క‌మిటీని ఏర్పాటుచేయాల‌ని ఈసీ భావిస్తున్న‌ది.

Electoral reforms: EC forms core panel to identify shortcomings, defers mlc polls in ap and ts

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసోం, బిహార్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నిక‌ల‌ నుంచి పాఠాలు నేర్చుకోవడం, అనుభవాలు, లోపాలను ఈ కమిటీ గుర్తిస్తుంది. ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, ఇటీవలి ఎన్నిక‌లు జ‌రిగిన‌ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, కొంతమంది ఎంపిక చేసిన ప్రత్యేక పరిశీలకులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండ‌నున్నారు. ఎన్నిక‌ల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు ఈ క‌మిటీ చేసే సూచ‌న‌లు ప్రాముఖ్య‌త సంత‌రించుకోనున్నాయి.

భారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలికభారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలిక

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈసీఐపై ప‌లు కోర్టులు చేసిన వ్యాఖ్య‌లను సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. భ‌విష్య‌త్‌లో ఇలాంటి మాట ప‌డ‌కుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు ప్యానెల్‌ను ఏర్పాటుచేస్తున్న‌ది. ఇదే స‌మ‌యంలో కేంద్రం క‌నుస‌న్న‌ల్లో ఈసీ ప‌నిచేస్తున్న‌ద‌ని గ‌త కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న అప‌వాదును చెరిపేసుకునే ప్ర‌య‌త్నం ఈసీ చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్న‌ది. ఇదిలా ఉంటే,

  Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Oneindia Telugu

  గతానికి భిన్నంగా ఎన్నికల విషయంలో ఈసీ ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నది. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు ఏపీ, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే నిర్వహిస్తామని తెలిపింది.

  English summary
  The Election Commission has decided to set up a Core Committee headed by Secretary-General, ECI to identify learning, experiences, and shortcomings from recently poll-gone States of Assam, Bihar, Kerala, Tamil Nadu, West Bengal, and Puducherry. The election commission on Thursday deferred legislative council polls in nine seats in Andhra Pradesh and Telangana due to the second wave of the coronavirus pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X