వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: స్మార్ట్ మీటర్లతో విద్యుత్ సరఫరా, ప్రీపెయిడ్ కనెక్షన్‌..పేదలకు మేలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : 16 Point Plan for Farmers to Revive The Farm And Agriculture Sector

దేశంలో ప్రతీ ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందరి ఇళ్లలో వెలుగు నింపేందుకు స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను ప్రవేశపెట్టబోతున్నామని పేర్కొన్నారు. అయితే ఇవి ప్రీపెయిడ్ మీటర్లను.. వినియోగదారులు తమకు ఎంత విద్యుత్ అవసరమనుకుంటే ప్లాన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

దేశంలో కొన్ని చోట్ల విద్యుత్ సదుపాయం లేదు. ఆయా చోట పవర్ డిమాండ్, చార్జీల నేపథ్యంలో కనెక్షన్ తీసుకొని వారు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరతో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను ప్రవేశపెడతామని విత్త మంత్రి పేర్కొన్నారు. పవర్ సరఫరా కోసం ఓ వైపు డిస్కోమ్‌లు ఒత్తిడికి గురవుతోన్న సమయంలో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను అందించబోతున్నామని ప్రకటించి కాస్త ఊరట కలిగించారు.

Electricity For All Through Smart Electricity Meters

ప్రతీ ఒక్కరికీ విద్యుత్ సదుపాయం అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఆయా స్మార్ట్ మీటర్లను వినియోగదారులు టారిఫ్ ఎంచుకొని వినియోగించుకోవాలని సూచించారు. దీంతో చార్జీల బెడద తప్పుతుందని, ముఖ్యంగా పేదలు తమకు అవసరమైన ప్యాకేజీ తీసుకొని, విద్యుత్ వెలుగులు పొందే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. స్మార్ట్ మీటర్లను నేచురల్ పద్ధతిలో రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.

English summary
Budget 2020 News in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X