వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగుతో సెల్ఫీ: తొండంతో దాడి చేయడంతో వ్యక్తి మృతి

సెల్పీ మోజుతో ఎంతో మంది ప్రాణాలు పోగోట్టుకొంటున్నారు. తాజాగా మరో వ్యక్తి ఏనుగు దాడిలో చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: సెల్పీ మోజుతో ఎంతో మంది ప్రాణాలు పోగోట్టుకొంటున్నారు. తాజాగా మరో వ్యక్తి ఏనుగు దాడిలో చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న అతనికి అటవీ ప్రాంతంలోని హైవేపై ఏనుగు వెళ్లడం కనిపించింది.

ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన సాదిఖ్‌.. దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. ఏనుగు తొండంతో దాడి చేసింది. దాంతో సాదిఖ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు సాదిఖ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

English summary
In a horrific instance of human-animal conflict, an elephant in north Bengal trampled a man to death when he stepped out of his vehicle on a highway to take a photograph of the tusker.The incident took place at 5 pm in Lataguri forest area of Jalpaiguri district. The elephant brought traffic to a grinding halt when crossing National Highway 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X