వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ బాల.. నదిలోకి దూకి తల్లి బిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బుడ్డోడు

|
Google Oneindia TeluguNews

అసోం : 11 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. తన కళ్ల ముందు నదిలో కొట్టుకుపోతున్న తల్లిబిడ్డలను కాపాడాడు. అసోంలో విరివిగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం తీవ్రమైంది. ఆ క్రమంలో నదులు, చెరువుల్లో నీటిమట్టం పెరిగిపోయింది. అయితే రెండు రోజుల కిందట ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో నదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయింది.

వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఆ ముగ్గురు కొట్టుకుపోయే క్రమంలో అక్కడే ఉన్న 11 సంవత్సరాల ఉత్తమ్ తాతి చూశాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నదిలోకి దూకాడు. తల్లిబిడ్డలను క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. అయితే చిన్నవయసులో అంతటి సాహసం చేసినందుకు ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 elevern years brave child save the woman and two children

ఆధార్‌తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!ఆధార్‌తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!

విషయం కాస్తా జిల్లా కలెక్టర్ లాఖ్యా జ్యోతి దాస్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన స్పందించారు. నదిలో మునిగిపోతున్న ముగ్గుర్ని రక్షించిన ఉత్తమ్ తాతి ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. జాతీయ స్థాయి సాహస బాలుర అవార్డుకు పంపించాలని డిప్యూటీ కమిషనర్‌కు సిఫార్సు చేశామన్నారు. ఆ బాలుడు చూపిన తెగువకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

English summary
Uttam Tati a 11 year old boy from Missamari saved a woman and her child from drowning in the river on July 7. Lakhya Jyoti Das, District Magistrate,says, the woman was trying to cross a small river with her 2 kids when water in the river suddenly increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X