వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వఛ్చభారత్ దిశగా మోడీ అడుగులు, మూడేళ్ళలో 4 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం

బహిరంగ మల విసర్జన రహిత దేశంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూనుకొన్నారు.ఈ మేరకు 2014 అక్టోబర్ రెండవ తేదిన స్వచ్ఛభారత్ మిషన్ ను మోడీ ప్రారంభించారు

By Pranav Gupta And Nitin Mehta
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బహిరంగ మల విసర్జన రహిత దేశంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూనుకొన్నారు.ఈ మేరకు 2014 అక్టోబర్ రెండవ తేదిన స్వచ్ఛభారత్ మిషన్ ను మోడీ ప్రారంభించారు.

దేశంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించడమే స్వచ్చభారత్ మిషన్ లక్ష్యం.ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన స్వాతంత్ర్యదినోత్సవ సంబరాల్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ మేరకు 2019 నాటికి భారత్ ను క్లీన్ ఇండియాగా మార్చేందుకు ప్రణాళికలను సిద్దం చేశాడు.

దేశంలో వందకోట్లకు పైగా జనాభా ఉంది.అయితే ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి లేదు.అయితే మలవిసర్జన కోసం మరుగుదొడ్లు లేని వారంతా ఆరుబయటనే మలవిసర్జన చేస్తున్నారు. ఈ పద్దతిని నిర్మూలించేందుకుగాను స్వఛ్చభారత్ కు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు.

Eliminating Open Defecation in India: Tracking the Progress under Modi Government

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 41.9 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.అయితే 2019 నాటికి ప్రతిఒక్కరికి మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించాలని మోడీ సర్కార్ భావిస్తోంది.ఈ ఐదేళ్ళ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించనుంది.

ఆనారోగ్య సమస్యల నిర్మూలనకు

బహిరంగ మలవిసర్జన వల్ల ప్రజలకు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.దీంతో ఆరుబటయ మలవిసర్జనను నిర్మూలించాలంటే మరుగుదొడ్లు నిర్మించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది.డిఫ్తీరియా లాంటి వ్యాధులకు బహిరంగ మలవిసర్జన కారణంగా మారింది.మరుగుదొడ్లు లేని కారణంగా కూడ బాలికలు విద్యకు దూరమౌతున్నారు. మరో వైపు మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చోటుచేసుకొంటున్నవిషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.మరో వైపు బాలికల విద్యపై ప్రభావం చూపుతున్నందున ఈ విషయాన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకొంది.

యూపిఏ కంటే మెరుగ్గా

ప్రస్తుతం ప్రతి పది ఇళ్ళలో ఆరు మరుగుదొడ్లున్నాయి.(61.72శాతం) అయితే ఈ మూడేళ్ళ కాలంలో సుమారు 20 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రభుత్వం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం లక్ష్యం కోసం కృషి చేస్తోంది.అయితే ఈ లక్ష్యసాధన దిశగా సర్కార్ చేపడుతున్న చర్యల కారణంగా మూడేళ్ల కాలంలో 20 శాతం మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యమైంది.

2014 అక్టోబర్ నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మరుగుదొడ్లను నిర్మించింది. స్వచ్చభారత్ దిశగా అడుగులేస్తోంది భారత్.అయితే 2012-13, 2013-14 లలో ఏడాదికి కేవలం 50 లక్షల కంటే తక్కువ మరుగుదొడ్లను నిర్మించారు. స్వచ్చభారత్ మిషన్ ప్రారంభించిన తర్వాత రెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైంది.ఇదే స్పీడ్ కొనసాగితే 2019 నాటికి ఆరుబయట మలవిసర్జన రహిత దేశంగా ఇండియా నిలబడే అవకాశం ఉంది.

స్థానిక సంస్థలకు బాధ్యత

ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించేందుకుగాను స్థానిక సంస్థలను రంగంలోకి దింపారు. ఆయా స్థానిక సంస్థలు తాము ఆరుబయట మలవిసర్జన రహిత గ్రామాలుగా ఉన్నామని ప్రకటించుకొనే పరిస్థితి రావాలని ప్రభుత్వం ఆకాంక్షను వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 1,93,374 గ్రామాలు ఆరుబయట మలవిసర్ఝనకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. కానీ,83,556 గ్రామాల్లోమాత్రమే పరిశీలన జరిగింది.

స్టాండర్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైంది. అయితే తమను తాము ఆరుబయట మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించుకొన్న తర్వాత ఈ సర్టిఫికెట్లు వస్తతాయి. అయితే చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు నిరూపయోగంగా ఉంటాయి. అసంపూర్తిగా ఇవి మిగిలిపోతాయి. అయితే తక్కువ నాణ్యత కలిగిన సీవరేజీ కారణంగా , ఇతరత్రా కారణాలతో మరుగుదొడ్లు పనిచేయకుండాపోయే పరిస్థితి ఉంటుంది.ఇలా జరిగితే ప్రజలు తిరిగి మళ్ళీ ఆరుబయటే మలవిసర్జనకు దిగుతారు.ఈ పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ స్థానిక సంస్థలను కోరుతోంది.

ముగింపు

మోడీ ప్రభుత్వం చాలా కష్టసాధ్యమైన పనిని ఎంచుకొంది,. ఆరుబయట మలవిసర్జన రహిత దేశంగా 2019 నాటికి భారత్ ను తీర్చిదిద్దే లక్ష్యం అంత సులభమమైన పని కాదు. అయితే ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలను భాగస్వామ్యులను చేయడం తప్పనిసరి. ప్రజలు భాగస్వామ్యులైతే ప్రతి కార్యక్రమం విజయవంతం కానుంది.

(Pranav Gupta is an independent researcher. Nitin Mehta is managing partner at Ranniti Consulting and Research.)

English summary
A key pillar of the Prime Minister's Swachh Bharat programme is providing each household access to toilet and eliminating open defecation. In his first Independence Day address to the nation, he had shared his resolve of achieving a 'Clean India' by 2019, the 150th birth anniversary year of Mahatma Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X