వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రివాల్‌కు షాక్: లంచం ఇవ్వజూపిన సిఎం కుమార్తెపై ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కూతురుపై భగత్ సింగ్ క్రాంతి సేన అధిపతి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రివాల్ కూతురు హర్షిత లంచం ఇవ్వచూపి ఓ ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహించేందుకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఢిల్లీలో అవినీతి 70 నుంచి 80శాతం వరకు తగ్గిపోయిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రివాల్ కూతురు డ్రైవింగ్ లైసెక్స్ కోసం వెళ్లి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఓ అధికారికి లంచం ఇవ్వచూపి పరీక్ష పెట్టారు.

కాగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్.. అవినీతికి వ్యతిరేకంగా 1031 అనే హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసింది. అవినీతి అధికారులకు సంబంధించిన వీడియోలు, వివరాలు దీనికి పంపించవచ్చని తెలిపింది. కాగా, ఈ హెల్ప్ లైన్ ఇప్పటి వరకు 1.25 లక్షల కాల్స్ రావడం గమనార్హం.

Embarrassment for Kejriwal? Complaint lodged against Delhi CM's daughter for offering bribe

అవినీతి పూర్తిగా లేకుండా చేయలేం, కానీ తగ్గిస్తామని ఆదివారం కేజ్రివాల్ ఢిల్లీలో ఆటో రిక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. తన కూతురు తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లిన సమయంలో ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోకుండా జాగ్రత్త పడ్డారని ఆమె తెలిపినట్లు చెప్పారు.

‘నా కూతురుకు లెర్నర్స్ డ్రైవింగ్ లైసెక్స్ కోసం వెళ్లింది. నేను ఫోన్ చేస్తే ఆ శాఖ అధికారులు ఈ పని చేసి పెడతారు. కానీ, నా కూతురు స్వయంగా కార్యాలయానికి వెళ్లింది. లైనులో నిల్చుంది. అయితే నా కూతురు అక్కడ ఎవరికీ సిఎం కూతురునని చెప్పుకోలేదు. ప్రభుత్వాధికారి దగ్గరకు వెళ్లి తాను అవసరమైన ఓ సర్టిఫికేట్‌ లేదని చెప్పింది. దీంతో అధికారి లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు' అని కేజ్రివాల్ తెలిపారు.

‘ఆ తర్వాత ఆ అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. అతడ్ని పరీక్షించేందుకే డబ్బు ఇవ్వచూపింది. అయితే ఆ అధికారి ఆమె చేతిలో ఉన్న ఫోన్‌తో వీడియో చేస్తుందేమోనని పరీక్షించాడు. లైసెన్స్ తనకు చాలా అవసరమని, ఎంత డబ్బైనా ఇచ్చేందుకు సిద్ధమని నా కూతురు అధికారికి తెలిపింది. కానీ ఆ అధికారి తీసుకునేందుకు నిరాకరించాడు' అని కేజ్రివాల్ చెప్పారు.

ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తన కూతురు అవసరమైన డాక్యుమెంట్ ఆ అధికారికి ఇచ్చినట్లు తెలిపారు. తన కూతురు డాక్యుమెంట్లు పరిశీలించిన అధికారులు.. ఢిల్లీ సిఎం కుమార్తె అని తెలియగానే అధికారులందరూ ఆమె కోసం లైసెన్స్ తయారు చేసే పనిలో పడ్డారని చెప్పారు.

English summary
Bhagat Singh Kranti Sena chief Tajinder Pal Singh Bagga has filed a complaint to Delhi Police against Delhi Chief Minister and AAP convenor Arvind Kejriwal's daughter for offering bribe to a government officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X