వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరకాల ప్రభాకర్ మంట: పీవీ, మన్మోహన్ లను చూసి మోడీ చాలా నేర్చుకోవాలంటూ హితవు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుడు ఎవరు? అనే ప్రశ్నకు.. కాస్తో, కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారిలో 90 శాతం మంది చెప్పే పేరు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బహుశా ఈ విషయంలో సందేహాలకు ఛాన్సే ఉండకపోవచ్చు. నరేంద్ర మోడీ తన తొలి ఇన్నింగ్ లో, సెకెండ్ ఇన్నింగ్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనను శక్తిమంతుడిగా తీర్చిదిద్దాయనేది విశ్లేషకుల ఉవాచ. ప్రతిపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు మినహాయిస్తే.. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నోరెత్తడానికి పెద్దగా సాహసించకపోవచ్చు.

సర్దార్ పటేల్ నిర్మించిన వ్యవస్థలను మోడీ కుప్పకూల్చారు: రాహుల్ గాంధీసర్దార్ పటేల్ నిర్మించిన వ్యవస్థలను మోడీ కుప్పకూల్చారు: రాహుల్ గాంధీ

మోడీ టార్గెట్ గా పరకాల చురకలు

మోడీ టార్గెట్ గా పరకాల చురకలు

ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకున్నారు పరకాల ప్రభాకర్. వివిధ రంగాల్లో విశ్లేషకుడిగా ఆయనకు పేరుంది. బీజేపీ సానుభూతిపరుడనే ముద్రా ఉంది. అన్నింటికీ మించి- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు భర్త. అలాంటి వ్యక్తి.. మోడీని టార్గెట్ గా చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పైగా కాంగ్రెస్ సీనియర్ నేతలను చూసి మోడీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ వ్యాఖ్యానించడం బీజేపీ నేతలను మంట పుట్టిస్తోంది. పరకాల ప్రభాకర్ అంత డేరింగ్ గా విమర్శించానికి ప్రధాన కారణం.. దేశ ఆర్థిక రంగం.

పీవీ-మన్మోహన్ లను చూసి నేర్చుకోండి..

పీవీ-మన్మోహన్ లను చూసి నేర్చుకోండి..

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తోన్న విధానాలనే మరి కొన్నాళ్ల పాటు కొనసాగిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమంటూ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని ధ్వజమెత్తారు. దీనికి ప్రధాన కారణం కేంద్రం అమలు చేసిన విధానాలే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పరకాల ప్రభాకర్ చురకలు అంటించారు. ఇప్పటికైనా కళ్లు తెరచుకోకపోతే ఆర్థిక రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు.

సర్దార్ సరే.. మన్మోహన్ ను కూడా ఐకన్ గా మార్చుకోండి..

సర్దార్ సరే.. మన్మోహన్ ను కూడా ఐకన్ గా మార్చుకోండి..

దేశ ఆర్థిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న సంకట స్థితులను ఉటంకిస్తూ పరకాల ప్రభాకర్ `ఎ లోడ్ స్టర్ టు స్టీర్ ద ఎకానమీ` శీర్షికన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వ్యాసాన్ని రాశారు. చాలా అంశాలను ఆయన స్పృశించారు. కాంగ్రెస్ కు చెందిన ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను బీజేపీ అధిష్ఠానం అత్యున్నత స్థాయిలో గౌరవిస్తోందని, పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ఆయనను ఐకన్ గా మార్చుకుందని చెప్పుకొచ్చారు. రాజకీయ అవసరాల కోసం వల్లబ్ భాయ్ పటేల్ పేరును పార్టీ ఎలా ఉపయోగించుకుంటోందో.. అదే తరహాలో ఆర్థిక విధానాల కోసం మన్మోహన్ సింగ్ ను కూడా అదే తరహాలో గౌరవించాల్సిన అవసరం ఉందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

పీవీ-మన్మోహన్ విధానాలే శ్రీరామరక్ష

పీవీ-మన్మోహన్ విధానాలే శ్రీరామరక్ష

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశం ఒడ్డున పడాలంటే.. పీవీ నరసింహా రావు-మన్మోహన్ సింగ్ ల విధానాలను అనుసరించక తప్పదని పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆ విధానాలే దేశానికి శ్రీరామరక్ష అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ను విమర్శించడం, ఆ పార్టీని చిన్నచూపు చూసి, విమర్శలు చేయడం ఒక్కటే దేశాన్ని కాపాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఉన్న మేధావులను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవ పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేయడంలో పార్టీ అగ్ర నాయకత్వం దారుణంగా విఫలమైందని కుండ బద్దలు కొట్టారు.

నెహ్రూ ఆర్థిక విధానాలను తప్పు పడితే ఎలా..

నెహ్రూ ఆర్థిక విధానాలను తప్పు పడితే ఎలా..


దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలను పార్టీ అగ్ర నాయకత్వం విమర్శించడంలో అర్థమే లేదని తేల్చి పారేశారు పరకాల ప్రభాకర్. ఆర్థిక వ్యవస్థ ఇంతటి దారుణ స్థితుల్లో ఉన్నప్పటికీ.. దీన్ని అంగీకరించడానికి బీజేపీ అధిష్ఠానానికి మనసు ఒప్పట్లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానాలను రూపొందించడంలో, దాన్ని అనుకున్న విధంగా అమలు చేయడంలో ఏ మాత్రం సానుకూలంగా లేదని, మూస ధోరణిలోనే వెళ్తోందని అన్నారు. 45 సంవత్సరాల తరువాత ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం భయానక స్థాయికి చేరుకుందని, ఆటోమొబైల్ రంగంలో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోతుండటమే దీనికి నిదర్శనమని అన్నారు.

English summary
The BJP should embrace the PV Narasimha Rao-Manmohan Singh economic architecture to steer the economy out of choppy waters, Parakala Prabhakar, a noted political economist and the husband of Union Finance Minister Nirmala Sitharaman has advised in an opinion piece in a newspaper on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X