వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశం..! మ‌ద్ద‌త్తు ధ‌ర‌పై స‌బ్సిడీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం..

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తుండంతో కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తోంది. మొన్న జీఎస్టీలో 26 వ‌స్తువ‌ల‌పై మినాహాయింపు ప్ర‌క‌టించి తీపి క‌బురు చెప్పిన కేంద్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోబోతోంది. ఇప్ప‌టికే వివిధ పంట‌ల‌పై కేంద్రం ఇస్తున్న మ‌ద్ద‌త్తు ధ‌ర పైన స‌బ్సిడి ఇవ్వాల‌ని కేంద్ర ఫ్ర‌భుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గ‌న‌క కార్యాచ‌ర‌ణ‌కు నోచుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల‌కు మేలు జ‌రగుతుంది.

ఢిల్లీలో పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ భేటీ..! రైతు సంక్షేమం కోసం నిర్ణ‌యం..!!

ఢిల్లీలో పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ భేటీ..! రైతు సంక్షేమం కోసం నిర్ణ‌యం..!!

తాజాగా ఢిళ్లీ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో భేటీ ఐన పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ రైతు మ‌ద్ద‌త్తు ధ‌ర‌పై స‌బ్సిడి ప్ర‌క‌టిస్తే వ్య‌వ‌సాయ దారుల‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యుక్తంగా ఉంటుంది, అలాగే కేంద్ర ప్ర‌భుత్వానికి ఎంత ఆర్థిక బారం ప‌డుతుంది అనే అంశంపై క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మావేశం లో స్టాండింగ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. రైతు సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలు పెద్ద యెత్తున కార్యాచ‌ర‌ణ రూపొందింస్తున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగం కోసం ఏదో ఒక‌టి చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కేంద్ర విధాన‌ల‌పై రైతుల నిర‌శ‌న‌..! దిద్దుబాటు దిశగా బీజేపి ప్ర‌భుత్వం..!!

కేంద్ర విధాన‌ల‌పై రైతుల నిర‌శ‌న‌..! దిద్దుబాటు దిశగా బీజేపి ప్ర‌భుత్వం..!!

ఇటీవ‌ల ముంభై, ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాల‌కు నిర‌శ‌న‌గా అనూహ్య రీతిలో ల‌క్ష‌లాది మంది రొడ్డెక్కిన విష‌యం తెలిసిందే..! రైతు వ్య‌తిరేక‌త పూర్తి స్థాయిలో వ్య‌క్తం కాక ముందే వారికి ఏదో ఒక‌టి చేయాల‌ని కేంద్రం స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వ‌రి, జొన్న‌, గోదుమ‌, ప‌త్తి, సోయా, కంది, మినుము, సెస‌ర, శెన‌గ‌, మిర్చి త‌దితర పంట‌ల‌పై ఇస్తున్న కేంద్ర మ‌ద్ద‌త్తు ధ‌ర‌తో పాటు స‌బ్సిడి కూడా వ్య‌వసాయ దారుల‌కు వ‌ర్తింప‌జేయాల‌ని కేంద్రం ప్ర‌దిపాద‌న‌లు సిద్దం చేస్తోంది.

మ‌ద్ద‌త్తు ధ‌ర పై స‌బ్సిడీ..! ప‌థ‌కం ఓకే ఐతే రైతు క‌ష్టాలు తీరిన‌ట్టే..!!

మ‌ద్ద‌త్తు ధ‌ర పై స‌బ్సిడీ..! ప‌థ‌కం ఓకే ఐతే రైతు క‌ష్టాలు తీరిన‌ట్టే..!!

స్టాండింగ్ క‌మిటీలో తీసుకున్న ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్రం ఆమోదం తెలిపితే దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది రైతాంగానికి మేలు జ‌ర‌గ‌డం ఖ‌య‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ద్ద‌త్తు ధ‌ర‌పై స‌బ్సిడీని దేశ వ్యాప్తంగా అములు చేయాలా లేక కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన ఫ‌లితాలు ప‌రిశీలించిన త‌ర్వాత మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేయాలా అనే అంశం స్టాండింగ్ క‌మిటీ మ‌రో క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ దారుల‌కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రైతు భీమా, రైతు బంధు ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేసి ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన ప్ర‌క్రియ విజ‌య‌వంతం కావ‌డంతో కేంద్రంలో క‌దిలిక వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

సాధ్యా అసాధ్యాలు ప‌రిశీలిస్తున్న క‌మిటీ..! త్వ‌ర‌లో కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు..!!

సాధ్యా అసాధ్యాలు ప‌రిశీలిస్తున్న క‌మిటీ..! త్వ‌ర‌లో కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు..!!

అందులో తెలంగాణ లో జ‌రుగుతున్న రైతు బందు ప‌థ‌కాన్ని దేశ‌వ్య‌ప్తంగా అమలు చేస్తే రైతుల క‌ష్టాల‌కు చెక్ పెట్టొచ్చ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌టన కూడా కేంద్ర ప్ర‌భుత్వం పైన ప్ర‌భావం చూపించింద‌ని తెలుస్తోంది. తాజాగా మ‌ద్య‌ప్ర‌దేశ్ లో కూడా ఆ రాష్ట్ర నూత‌న ముఖ్య మంత్రి క‌మ‌ల్ నాథ్ కూడా రైతు రుణ మాఫీ ఫైల్ మీద‌నే తొలి సంత‌కం చేసి రైతు ప‌క్షాణ కాంగ్రెస్ ఎంత చిత్త శుద్ది ఉందో చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా రైతు సంక్ష‌మం కోసం ఎంత క‌ట్టుబ‌డి ఉందో చెప్పేందుకు సంక్షేమ ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
The attitude of the central government has changed since the general election is close. The ban on the 26 items in the giant GST is now going to take a decision in favor of farmers across the country. It seems that the central government is supposed to give subsidy on the support price already offered at different crops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X