వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో.. నో... అస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్‌ ఎమర్జెన్సీ టీకాకు అనుమతి లేదు, భారత్ క్లారిటీ..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్‌లో అత్యవసరంగా ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇండియా కూడా అనుమతి ఇస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎమర్జెన్సీ సమయంలో కూడా టీకా ఇవ్వడానికి భారత్ పర్మిషన్ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు అత్యవసరంగా ఇవ్వడానికి అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అస్ట్రాజెనెకాతో భారత్ బయోటెక్ టై అప్ అయ్యింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా డెవలప్ చేస్తోంది. సీరం అభ్యర్థనపై జనవరి 1వ తేదీన నిపుణుల ప్యానెల్ సమావేశం కానున్నది. అప్పుడు ఎమర్జెన్సీగా వ్యాక్సిన్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కరోనా వైరస్ స్ట్రెయిన్ టెన్షన్ పెట్టిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.

Emergency Use Approval Not Granted to Oxford-AstraZeneca and BharatBiotech Vaccine

అమెరికా తర్వాత భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరి అవుతోంది. మరో ఆరు నుంచి 8 నెలల్లో 300 మిలియన్ వ్యాక్సిన్లను తయారు చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. అయితే సీరం ఇనిస్టిట్యూట్‌తో టీకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. మార్కెట్లోకి తొలుత టీకా వస్తుందని.. ఇక్కడ అందజేశాకే ఎగుమతి చేస్తామని చెబుతోంది. సౌత్ ఏసియా, ఆఫ్రికా దేశాలకు టీకాను అందజేస్తామని వివరించింది.

English summary
Serum Institute of India and Bharat Biotech were not granted emergency use authorization for their Covid-19 vaccines today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X