వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ నృత్యకారుడు, శాస్త్రీయ నృత్య చరిత్రకారుడు ‘పద్మశ్రీ’ సునీల్ కొఠారీ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు, విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన.. ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా అక్కడే తుదిశ్వాస విడిచారు.

బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్

గత నెల ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన స్నేహితురాలు విధా లాల్ ప్రకటన విడుదల చేశారు. 'దాదాపు నెల కిందట కొఠారీ కొవిడ్‌ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు' అని లాల్ వెల్లడించారు.

Eminent dance scholar, Dance historian and critic Sunil Kothari passes away at 87

ముంబైలో 1933 డిసెంబర్ 20న జన్మించిన ఆయన చార్టడ్ అకౌంటెంట్‌‌గా ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆ తర్వాత భారతీయ నృత్య కళలవైపు మళ్లారు. సుమారు 20కి పైగా పుస్తకాలు రాశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలపై ఆయన పుస్తకాలు రచించారు. ఉదయ్ శంకర్, రుక్మిణీ దేవి అరుండల్ ఫొటో బయోగ్రఫీలు రచించారు.

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణబిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

నృత్య విభాగంలో ఆయన చేసిన సేవలకు గానూ కొఠారీ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. 1995లో సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డు సైతం అందుకున్నారు.

English summary
Eminent dance scholar and critic Sunil Kothari, 87, passed away on Sunday morning in a private hospital in Delhi because of COVID-19 related complications. A Sangeet Natak Akademi fellow, Kothari blazed a new trail in documenting Indian classical dance forms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X