వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత: అత్యంత ఖరీదైన లాయర్‌, వాదించారంటే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయశాఖ మంత్రి రాంజెఠ్మలానీ(95) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ.. తన ఇంట్లోనై వైద్య చికిత్సను తీసుకున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌గా పేరుపొందారు.

Eminent lawyer and former Union law minister Ram Jethmalani passes away

జెఠ్మలానీ వాదిస్తున్న కేసును మరో లాయర్ తీసుకునేందుకు కూడా భయపడేవారంటే ఆయన వాదన పటిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన వాదించిన 90శాతం కేసుల్లో విజయం సాధించడం గమనార్హం.

సింధ్ ప్రావిన్స్‌లోని సిఖర్పూర్‌లో రాంజెఠ్మలానీ సెప్టెంబర్ 14, 1923న జన్మించారు. కాగా, సుప్రీంకోర్టు, హైకోర్టులు, విచారణ కోర్టుల్లో వాదించే సమయంలో రాంజెఠ్మలానీ తన పేరును రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీగా పెద్ద అక్షరాలతో రాసేవారు.

ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు సహా.. దేశంలో ప్రముఖ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఎన్నో సుదీర్ఘ కేసులను జెఠ్మలానీ వాధించారు. లాయర్‌గా, రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. బీజేపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా జెఠ్మలానీ పనిచేశారు.

అయితే, జెఠ్మలానీ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోన్నారు. హై ప్రొఫైల్ కేసులను మాత్రమే ఆయన వాదిస్తారనే విమర్శలున్నాయి. కాగా, రాంజెఠ్మలానీ కొడుకు మహేష్ జెఠ్మలానీ, ఆయన కూడా ప్రముఖ న్యాయవాదిగా కొనసాగతున్నారు. జెఠ్మలానీ కూతురు రాణి జెఠ్మలానీ గతంలోనే మరణించగా.. మరో కూతురు అమెరికాలో ఉంటున్నారు.

రాంజెఠ్మలానీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ఘన నివాళులర్పించారు. రాంజెఠ్మలానీ న్యాయస్థానంలో, పార్లమెంటులో అందించిన సేవలు మరువలేమని ఆయన అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక సాన్నిహిత్యం ఉందని అన్నారు.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. రాంజెఠ్మలానీ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. మనం ప్రముఖ న్యాయవాదినే కాదు, ఓ గొప్ప మానవతావాదిని కోల్పోయామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Eminent lawyer and former Union law minister Ram Jethmalani passed away early on Sunday morning. He was 95.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X