వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిషీల్డ్ ఫస్ట్ బ్యాచ్ రవాణాపై సీరం సిఈవో భావోద్వేగం .. ఇండియాలో 13 ప్రాంతాలకు చేరిన వ్యాక్సిన్

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ రవాణా మొదలైంది .పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ లో నిపుణుల బృందం అహర్నిశలు శ్రమించి తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రజల ఆరోగ్య రక్షణకు దేశ ప్రజలకు అందుబాటులోకి రావడంతో తన బృందానికి ఇది " భావోద్వేగా క్షణం" అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవల్లా ట్వీట్ చేశారు.

భావోద్వేగానికి గురైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవాల్లా

భావోద్వేగానికి గురైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవాల్లా

భారతదేశపు మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ యొక్క 56.5 లక్షల మోతాదును ఈ ఉదయం సీరం ఇన్స్టిట్యూట్ నుండి నుండి ఢిల్లీ , చెన్నై, బెంగళూరు, లక్నో, కోల్‌కతా, గౌహతి మరియు పాట్నాతో సహా వివిధ నగరాలకు వెళ్ళింది . కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో భావోద్వేగానికి గురైన అదార్ పూనవల్లా ట్వీట్‌తో రెండు ఫోటోలను కూడా పంచుకున్నారు . సీరం ఇనిస్టిట్యూట్‌లోని మొత్తం బృందం , వ్యాక్సిన్ రవాణా బాక్సులతో ట్రక్ వద్ద ఉన్న రెండు ఫోటోలను తన ట్వీట్ తో పాటు పంచుకున్నారు.

ప్రభుత్వానికి అతితక్కువ ప్రత్యేక ధర :.. టీకా డోసు రూ 200

ప్రభుత్వానికి అతితక్కువ ప్రత్యేక ధర :.. టీకా డోసు రూ 200

ఏప్రిల్ 2021 నాటికి మొత్తం 5.60 కోట్ల మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మోతాదుకు ₹ 200 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ 1.10 కోట్ల మోతాదులను సోమవారం కొనుగోలు చేయగా, ఏప్రిల్ 2021 నాటికి మరో 4.50 కోట్ల మోతాదులను కొనుగోలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం కోరిన మేరకు మొదటి 100 మిలియన్ మోతాదులకు 200 డాలర్ల ప్రత్యేక ధరను ఇచ్చినట్లు అదార్ పూనవల్లా తెలిపారు.

ప్రైవేటు మార్కెట్ లో వ్యాక్సిన్ 1 వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తామని వెల్లడి

ప్రైవేటు మార్కెట్ లో వ్యాక్సిన్ 1 వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తామని వెల్లడి

దీనిపై స్పందించిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనవల్లా కరోనా వ్యాక్సిన్ పై మొదట్లో లాభం పొందలేమని నిర్ణయించుకున్నాము. మొదట ప్రభుత్వం కోరిన మేరకు వ్యాక్సిన్లను అందించి, ఆ తరువాత మేము తిరిగి ధరను నిర్ణయిస్తామని, ప్రైవేటు మార్కెట్ లో వ్యాక్సిన్ 1 వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.

రెండు టీకాలు - ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకా మరియు భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ - అత్యవసర వినియోగ అనుమతి పొందింది.

భారతదేశంలో 13 ప్రాంతాలకు చేరిన కోవిషీల్డ్

కోవిషీల్డ్ రెండు-మోతాదుల వ్యాక్సిన్ లను 28 రోజుల వ్యవధిలో ఇవ్వవలసి ఉంటుంది.
భారతదేశం మొదటి దశలో సామూహిక టీకాలు వేయడం ప్రారంభించింది . కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క వ్యాక్సిన్ డోసు లను కలిగి ఉన్న ఫస్ట్ బ్యాచ్ పూణే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి భారతదేశంలో 13 ప్రాంతాలకు వివిధ రవాణా మార్గాల ద్వారా పంపబడింది . ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ మరియు ఇండిగో ఎయిర్‌లైన్స్ 56.5 లక్షల మోతాదులో వ్యాక్సిన్‌ను భారతదేశంలోని 13 రాష్ట్రాలలో గమ్యస్థానాలకు చేర్చాయి.

వ్యాక్సిన్ డోసులు చేరిన ప్రధాన నగరాలివే

వ్యాక్సిన్ డోసులు చేరిన ప్రధాన నగరాలివే

టీకాలు వేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ మరియు భారత్ బయోటెక్ నుండి ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్ల కోసం కేంద్రం ఆర్డర్లు ఇచ్చింది. మొదటి దశ పూర్తి ఖర్చును కేంద్రం భరిస్తుంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఈ రోజు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ మరియు ఇండిగో ఎయిర్లైన్స్ పూణే నుండి 56.5 లక్షల మోతాదులతో 9 విమానాలను ఢిల్లీ , చెన్నై, కోల్‌కతా, గౌహతి , షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్ , బెంగళూరు, లక్నో మరియు చండీగడ్ లకు చేర్చారని పేర్కొన్నారు.

English summary
Serum Institute of India CEO Adar Poonawalla tweeted that it was an "emotional moment" for his team at the Pune facility as the first shipments of the Covishield vaccine rolled out today. 56.5 lakh doses of Covishield, India's first coronavirus vaccine, left the SII this morning for various cities including Delhi, Chennai, Bengaluru, Lucknow, Kolkata, Guwahati and Patna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X