వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రత్యూషను తెచ్చివ్వగలరా?: దీనంగా రాహుల్ ప్రశ్న

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: తెలుగు టీవీ సిరియల్ 'చిన్నారి పెళ్ళికూతురు' ఫేం ప్రత్యూష బెనర్జీ కేసులోని మలుపులు కూడా టీవీ సీరియళ్లలోని భావోద్వేగ సన్నివేశాల మాదిరి తలపిస్తున్నాయి. ప్రత్యూష బెనర్జీని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహల్ రాజ్ సింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో విచారణ నిమిత్తం బుధవారం రాహుల్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రి నుంచి బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో రాహుల్ రాజ్ సింగ్‌ను మీడియా పలుకరిస్తే నా ప్రత్యూషను తెచ్చివ్వగలరా? అని దీనంగా అడుగుతున్నాడట.

'Emotional' Rahul Raj Singh asks 'can you bring Pratyusha back'

పోలీస్ స్టేషన్‌కి బయటకు వచ్చిన రాహుల్‌ని మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు రాహుల్ వారికీ ఇదే ప్రశ్న వేశాడు. ప్రత్యూష ఆత్మహత్యే కేసులో రాహుల్‌ను అరెస్ట్‌ చేయవద్దంటూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బుధవారం విచారించిన బాంబే హైకోర్టు, రూ.30 వేలు పూచీకత్తుపై అతనిని అరెస్ట్ చెయ్యవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఏప్రిల్ 18 వరకూ ప్రతిరోజూ పోలీసు స్టేషన్‌లో హాజరవ్వాలని ఆదేశించింది.

కాగా 'బాలికా వధు' టీవి నటి ప్రత్యూష బెనర్జీ ఏప్రిల్ 1వ తేదీన గురుగ్రామ్‌లోని తన సొంత ప్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నటి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌ రాజ్ సింగ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

English summary
Rahul Raj Singh, who is presently in dock for abetting the suicide of his girlfriend Pratyusha Banerjee, on Wednesday looked quite disturbed as he attempted to downplay the allegations levelled against him by the late actress’ friends and family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X