వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతఘర్షణలు నాతండ్రి ప్రాణం తీసింది, యూపీ ఇన్స్ పెక్టర్ కుమారుడు, రేపు ఎవరి తండ్రి !

|
Google Oneindia TeluguNews

బులంద్ షహర్: ఆచారం పేరుతో జరిగే అల్లర్లను తన తండ్రి ఎదురించేవారు. అయితే అదే హిందూ-ముస్లీంల మతఘర్షణల్లో ఈ రోజు నా తండ్రి మరణించారు, ఈ గొడవలకు రేపు ఎవరి తండ్రి మరణిస్తారో ఎవరు చెప్పగలరు అని ఉత్తరప్రదేశ్ లో జరిగిన అల్లర్లలో మరణించిన పోలీస్ ఇన్స్ పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కుమారుడు అభిషేక్ అంటున్నారు.

అక్రమ గోవుల రవాణ, అక్రమ గోవధకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని జలంద్ షహర్ లో సోమవారం జరిగిన అల్లర్లలో పోలీస్ ఇన్స్ పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అల్లర్లు అదుపు చెయ్యడానికి వెళ్లిన ఇన్స్ పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో మరణించారు.

Emotional statement by son of deceased cop Subodh Kumar Singh

ఈ సందర్బలో హిందూ- ముస్లీల మతఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్స్ పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కుమారుడు అభిషేక్ మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి. పోలీసు అధికారిగానే కాకుండా ఒక మానవతావాదిగా తన తండ్రి ఎప్పుడూ అల్లర్లను వ్యతిరేకించి శాంతిని కోరుకునేవారని అభిషేక్ మీడియాకు చెప్పారు.

పోలీసు దుస్తులు వేసుకుని శాంతిని కాపాడాలని ప్రయత్నించిన తన తండ్రిని ఎవరు పొట్టన పెట్టుకున్నారు అని చెప్పాలని తాను ప్రశ్నిస్తున్నానని, దానికి ఎవరు సమాధానం ఇస్తారని అభిషేక్ విలపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని సృష్టిస్తున్న అల్లర్లలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ఇకనైనా ఇలాంటి గొడవలకు స్వస్తి పలకాలని ఇన్స్ పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కుమార్ అభిషేక్ మనవి చేస్తున్నారు.

English summary
Bulandshahr clash in Uattar Prades: Emotional statement by son of deceased cop Subodh Kumar Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X