వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటినే టాప్: అయినా ఇదో వేతనమా.. ఏం ఉద్యోగాలో...

ఉద్యోగుల్లో తాము చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల పలు మెట్రో నగరాల్లో స్పందన ఆసక్తికరంగా ఉంది. బెంగళూరు నగరంలో 63 శాతం మంది వేతనజీవులు తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉన్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చాలీ చాలని వేతనం.. ఏం ఉద్యోగమో.. ఏమో‌! వచ్చే జీతం చాలట్లేదు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు.. భారంగా మారిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో 70% మంది వేతన జీవుల ఆందోళన ఇదే.

ప్రముఖ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ 'విజ్‌డమ్‌జాబ్స్‌డాట్‌ కామ్‌' తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ సంగతి నిగ్గు తేలింది. ఉద్యోగుల్లో తాము చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల పలు మెట్రో నగరాల్లో స్పందన ఆసక్తికరంగా ఉంది.
బెంగళూరు నగరంలో 63 శాతం మంది వేతనజీవులు తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉన్నారు. తర్వాత స్థానంలో ఉన్న పుణెలో 57% మంది సంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే చెబుతోంది.

హైదరాబాద్‌లో 54% మాత్రమే

హైదరాబాద్‌లో 54% మాత్రమే

మూడో స్థానంలో ఉన్న ముంబైలో 54% మంది వేతనాల పట్ల సంతృప్తిగా ఉండగా..నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నగరంలో 51 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని సమాచారం.. ఇక దేశరాజధాని ఢిల్లీలో కేవలం 49 శాతం మంది మాత్రమే జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉండడం గమనార్హం. ఇక చెన్నైలో 46 శాతం మంది మాత్రమే చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉన్నారని ఈ అధ్యయనం నిర్ధారించింది. ఐటీ, టెలికం, ఐటీఈఎస్, రిటైల్ వ్యాపారం, విద్యారంగం, మీడియా, వినోదం, మౌలిక వసతులు, ఆరోగ్య పరిరక్షణ, లాజిస్టిక్స్‌ రంగాల్లో సర్వే నిర్వహించారు.

జీతభత్యాల్లో టాప్ ఐటీరంగమే

జీతభత్యాల్లో టాప్ ఐటీరంగమే

జీతభత్యాల చెల్లింపుల్లో అగ్రగామిగా ఐటీరంగం నిలిచింది. ఈ రంగంలో పని చేస్తున్న 65% మంది ఉద్యోగులు ప్రస్తుతం తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో ఐటీ తరవాత మీడియా, వినోద రంగం రెండో స్థానంలో నిలిచాయి. ఈ రంగాల్లో పనిచేస్తున్న వారిలో 58% మంది తమకు అందుతున్న జీతభత్యాలపట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

బేసిక్ వేతనం అధికంగా ఉండాలని ఆకాంక్ష

బేసిక్ వేతనం అధికంగా ఉండాలని ఆకాంక్ష

సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది తమ బేసిక్ వేతనం అధికంగా ఉండాలని తెలిపారు. మరో 42 శాతం మంది అదనపు భత్యాలు, అదనపు పనికి అదనపు వేతనం, ఇతర ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అత్యధిక వేతనాలు ఇచ్చే సంస్థల్లో పనిచేసేందుకే 80 % మంది ఆసక్తి చూపారు. 45 % మంది ఉద్యోగులు తమతో పాటే కెరీర్‌ ప్రారంభించిన వారి కంటే తమకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయని మనోవేదనకు గురవుతున్నారు.

భరోసా కల్పనలో పథకాలు విఫలం

భరోసా కల్పనలో పథకాలు విఫలం

తమ పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే పథకాలు, ఆరోగ్యబీమా, రిటైర్మెంట్‌ తరవాత అందే భత్యాలపై ఆయా రంగాలకు చెందిన ఉద్యోగుల్లో అత్యధికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 శాతం మంది ఉద్యోగులు పనివేళల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. మాతృత్వ, పితృత్వ ప్రయోజనాల పట్ల కేవలం 30 శాతం మంది మాత్రమే సంతృప్తి చెందుతున్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో 28 శాతం మందికి మాత్రమే సంతృప్తి ఉంది. మహిళా ఉద్యోగులు మాత్రం జీతభత్యాలతోపాటు ఆరోగ్య బీమా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఉండాలని.. వేతనంతోపాటే ఇవీ ముఖ్యమేనని పేర్కొన్నారు. ఇక విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో 60% మంది తమకు లభిస్తున్న జీతభత్యాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే నిగ్గు తేల్చింది.

English summary
Employes in different sectors are concerned thier salaries because thier kids fees payments, hospital bills & daily essentials rates to be high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X