వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్ మృతదేహాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఎన్‌కౌంటర్‌కు గురైన దిశ నిందితుల మృతదేహాలు మార్చురీలోనే భద్రపరచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి తదుపరి తీర్పు వచ్చే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మృతదేహాల దహనంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కాగా శుక్రవారం నాడు హైకోర్టు నిందితుల మృతదేహాలు అప్పగించాలని వాదనలు కొనసాగనున్న నేపథ్యంలో వాటికి బ్రేకులు పడ్డాయి. ఎన్‌కౌంటర్ పై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతుండగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

కాగా ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జీతో కూడిన ముగ్గురు సభ్యుల కమీషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు రిటైర్డ్ జడ్జీలతో పాటు మాజీ సీబీఐ డైరక్టర్ అయిన కార్తీకేయన్‌ను సభ్యులుగా నియమించారు. కాగా దీనిపై విచారణ ఆరునెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎన్‌కౌంటర్ ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందంటూ..

encounter bodies of the Disha accused should be kept in the Mortuary

సుప్రీలో కోర్టులో పలువురు పటిషన్‌లు వేయడంతో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే... మరోవైపు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సైతం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అటు న్యాయ కమీషన్ తోపాటు సిట్ సభ్యులు కూడ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టనున్నారు. కాగా కేసు విచారణను జనవరి రెండున సుప్రీం కోర్టు మరోసారి విచారణ చేపట్టానున్నారు

English summary
encounter bodies of the Disha accused should be kept in the Mortuary supreme court orederd the telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X