వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు కీలకనేత దేవరాజ్ ఎన్ కౌంటర్

దేవరాజ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, చత్తిస్ ఘడ్ లో మావోయిస్టులకు కీలక నేతగా పనిచేస్తున్నాడని, అతని ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవరాజ్ అలియాస్ కుప్పు దేవరాజ్ అలియాస్ కుప్పుస్వామి జోగష్ అలియాస్ బాలజీ (57), అజిత (38) అనే మహిళ మృతి చెందారు.

మరో మావోయిస్టు సోమన్ (36) అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతను తప్పించుకున్నాడని మలప్పురం పోలీసులు తెలిపారు. తమిళనాడు-కేరళ సరిహద్దులోని మలప్పురం జిల్లా నిలంబూరు అటవీ ప్రాంతంలో 11 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారని పోలీసులకు సమాచారం అందింది.

Encounter: Kuppu Devraj killed major loss for Maoists

దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపులు చేపట్టారు.పడుక్క ప్రాంతంలో మావోయిస్టులు ఉన్న గుడారం మీద పోలీసులు బాంబులు వేశారు. మావోయిస్టులు పోలీసులకు మీద కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దేవరాజ్, అజిత మరణించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ నైరుతి ప్రాంత బ్యూరో సభ్యుడు, తమిళనాడు స్పెషల్ ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి దేవరాజ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, చత్తిస్ ఘడ్ లో మావోయిస్టులకు కీలక నేతగా పనిచేస్తున్నాడని, అతని ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 40 లక్షలు రివార్డు ప్రకటించిందని మలప్పురం పోలీసులు తెలిపారు.

English summary
The encounter in the Kerala on Thursday afternoon was a fake encounter. They were killed by poisoning. If they were killed during a fight with the police, they might have got some injuries on their bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X