వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

disha rape encounter:సీపీ సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు, అమ్మాయిల కన్నీళ్లు !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిశను ఎక్కడైతే దారుణంగా చంపేశారో అక్కడే ఆ కేసులోని నలుగురు దర్మార్గులను అంతమొందించారు సైబరాబాద్ పోలీసులు. శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా తెలంగాణలోని సైబరాబాద్ పోలీసుల పేరే వినిపిస్తోంది. సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంతో కామాంధులు తప్పు చెయ్యాలంటే మరోసారి ఆలోచిస్తారని నేడు కాలేజ్ అమ్మాయిలు, యువత అంటోంది. వెటర్నటీ డాక్టర్ దిశను దారుణంగా, కిరాతకంగా అంతం చేసిన మహమ్మద్ ఆరీఫ్, జోల్లు శివ, జోల్లు నవీన్, చెన్నకేశవులను సైబరాబాద్ పోలీసులు పైలోకాలకుం పంపించారు. నిందితులు ఎన్ కౌంటర్ తో సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ పేరు నేడు దేశ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే సీపీ విశ్వనాథ్ సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు, అమ్మాయి కంట్లో నీరు వస్తే విశ్వనాథ్ సజ్జనార్ చలించిపోతారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

Recommended Video

CP Sajjanar Press Meet || ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి || Oneindia Telugu
ప్రతి మహిళలో తల్లిని చూశాడు

ప్రతి మహిళలో తల్లిని చూశాడు

చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న విశ్వనాథ్ సజ్జనార్ కు అమ్మ విలువ ఎంత విలువైనదో బాగా తెలుసు. అందుకే ప్రతి చెల్లి, ప్రతి ఆడపడుచు, ప్రతి మహిళని సీపీ విశ్వనాథ్ సజ్జనార్ ఆయన తల్లితో సమానంగా చూస్తారు. తల్లి విలువ తెలిసిన వ్యక్తి విశ్వనాథ్ సజ్జనార్ యాసిడ్ దాడి కేసు ఎన్ కౌంటర్, దిశ హత్యాచారం కేసు ఎన్ కౌంటర్ విషయంలో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.

 చిన్న గ్రామంలో తల్లిదండ్రులు

చిన్న గ్రామంలో తల్లిదండ్రులు

కర్ణాటకలోని గదగ్ జిల్లా రోణ తాలుకాలోని చిన్న గ్రామంలో చెన్నప్ప సజ్జనార్, గిరిజమ్మ దంపతులు నివాసం ఉండేవారు. చెన్నప్ప సజ్జనార్, గిరిజమ్మ దంపతుల కుమారుడే విశ్వనాథ్ సజ్జనార్. అయితే విశ్వనాథ్ సజ్జనార్ పుట్టింది మాత్రం హుబ్బళి నగరంలో. విశ్వనాథ్ సజ్జనార్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు.

సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు

సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు

విశ్వనాథ్ సజ్జనార్ బాల్యంలోనే ఆయన తల్లి గిరిజమ్మ మరణించారు. తల్లి దూరం కావడంతో చిన్నతనంలో సజ్జనార్ తల్లి ప్రేమానురాగాల కోసం తల్లడిల్లిపోయారు. హుబ్బళిలో విశ్వనాథ్ సజ్జనార్ చిన్నమ్మ మల్లమ్మ నివాసం ఉండేవారు. హుబ్బళిలోని చిన్నమ్మ మల్లమ్మ దగ్గర విశ్వనాథ్ సజ్జనార్ పెరిగారు. విశ్వనాథ్ సజ్జనార్ కు తల్లిలేని లోటు ఎక్కడా కనపడకుండా మల్లమ్మ ఆయన్ను పెంచిపోషించారు. తల్లి చిన్నతనంలోనే మరణించడంతో ఏ మహిళ కనపడినా సజ్జనార్ ఎంతో గౌరవంతో చూసేవారని, అందరిలో తన తల్లిని చూసుకునేవారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఐపీఎస్ అధికారి అయిన తరువాత విశ్వనాథ్ సజ్జనార్ హుబ్బళి నగరంతో పాటు చిన్ననాటి స్నేహితులు, బంధువులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు.

 విద్యలో ప్రతిభావంతుడు

విద్యలో ప్రతిభావంతుడు

విశ్వనాథ్ సజ్జనార్ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాభ్యాసం హుబ్బళిలోని లయన్స్ స్కూల్ లో జరిగింది. పీయూసీ (ఇంటర్), డిగ్రీ హుబ్బళిలోని కేఎల్ ఇ జగద్గురు గంగాధర కాలేజ్ లో పూర్తి చేశారు. దారవాడలోని కర్ణాటక యూనివర్శిటీలో విశ్వనాథ్ సజ్జనార్ ఎంబీఏ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాథ్ సజ్జనార్ అందరితో ఎంతో మర్యాదగా మాట్లాడేవారని పేరు ఉంది. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత 1996 యూపీఎస్ఇ పరీక్షలు రాసిన విశ్వనాథ్ సజ్జనార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ క్యాడర్ అధికారి అయ్యారు.

గర్వంగా ఉంది

గర్వంగా ఉంది

విశ్వనాథ్ సజ్జనార్ సోదరుడు మల్లికార్జున సజ్జనార్ ప్రస్తుతం హుబ్బళి నగరంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువ జామున దిశ హత్యాచారం కేసులో నలుగురు దుర్మార్గులు ఎన్ కౌంటర్ అయిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మీడియాలో ఈ విషయం తెలుసుకున్న విశ్వనాథ్ సజ్జనార్ సోదరుడు మల్లికార్జున సజ్జనార్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఎన్ కౌంటర్ చేశారు

అందుకే ఎన్ కౌంటర్ చేశారు

దిశ మీద అత్యాచారం చేసి హత్య చేశారని మీడియాలోనే తాను తెలుసుకున్నానని, తన సోదరుడు విశ్వనాథ్ సజ్జనార్ ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేస్తారని మొదటి నుంచి తనకు నమ్మకం ఉందన్నారు. నేడు నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారని మీడియాలో చూశానని, తన సోదరుడు సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ చట్టపరంగానే ఈ ఎన్ కౌంటర్ చేశారని పూర్తిగా నమ్ముతున్నానని, నిజంగా దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని మల్లికార్జున్ సజ్జనార్ అన్నారు.

English summary
Encounter Specialist Police Officer VC Sajjanar is from hubballi in Karnataka. He is done his school and college education in hubballi and dharwad. His parents staying in hubli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X