engagement lovers ceremony family bengaluru jobs life valentines day software engineer bharat mata photo karnataka నిశ్చితార్థం లవర్స్ ఫ్యామిలీ బెంగళూరు ఉద్యోగాలు జీవితం ప్రేమికుల రోజు చిక్కమగళూరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫోటో కర్ణాటక
Engagement: ప్రేమికుల రోజు టెక్కీలు ఏం చేశారంటే, వెరైటీగా, ఫ్యామిలీ ఓకే, వైరల్ మామా !
బెంగళూరు/ చిక్కమగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు (టెక్కీలు)గా ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకుడు వెరైటీగా నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బెంగళూరులోని ప్రముఖ కంపెనీల్లో టెక్కీలు అయిన యువతీ, యువకుడు ప్రేమికుల రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. అందరిలాగా ఉంగరాలు మార్చుకుని వీళ్లు నిశ్చితార్థం చేసుకోలేదు. ఏదైనా వెరైటీగా నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించిన టెక్కీలకు వాళ్ల కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వెరైటీగా నిశ్చితార్థం చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అయ్యారు.
Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !

బెంగళూరు టెక్కీలు
కర్ణాటకలోని చిక్కమగళూరులో విద్యాశ్రీ అనే యువతి నివాసం ఉంటున్నది. చిక్కమగళూరు నగరం సమీపంలోని హీరేమగళూరులో రవీష్ పటేల్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. బెంగళూరులోని ప్రముఖ కంపెనీల్లో రవీష్ పటేల్, విద్యాశ్రీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. టెక్కీలుగా ఉద్యోగాలు చేస్తున్న రవీష్ పటేల్, విద్యాశ్రీ బాగానే జీతాలు తీసుకుంటున్నారు.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్
రవీష్ పటేల్, విద్యాశ్రీ బెంగళూరులో ఉద్యోగాలు చేస్తుండటంతో వాళ్లకు పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి చేసుకోవడానికి రవీష్ పటేల్, విద్యాశ్రీ సిద్దం అయ్యారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం చెయ్యాలని, మంచి రోజు చూసి బంధువులు స్నేహితులు అందర్నీ పిలిచి పెళ్లి జరిపించాలని రవీష్ పటేల్, విద్యాశ్రీ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

వెరైటీ నిశ్చితార్థం
పెళ్లికి ముందు జరిగే ముఖ్యమైన వేడుక నిశ్చితార్థం. నిశ్చితార్థం సందర్బంగా పెళ్లి కుమారుడికి, పెళ్లి కూతురికి ప్రత్యేకంగా ఉంగరాలు చేయించి పట్టు వస్త్రాలు తీసిచ్చి నిశ్చితార్థం చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా వెరైటీగా నిశ్చితార్థం చేసుకోవాలని రవీష్ పటేల్, విద్యాశ్రీ అనుకున్నారు.

భరతమాత ఫోటోలు
వెరైటీ నిశ్చితార్థం చేసుకుంటామని రవీష్ పటేల్, విద్యాశ్రీ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రేమికుల రోజు రవీష్ పటేల్, విద్యాశ్రీ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. చిక్కమగళూరులోని పెళ్లి కుమార్తె విద్యాశ్రీ ఇంటిలో నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలు మార్చుకోకుండా పెళ్లి కొడుకు రవీష్ పటేల్, పెళ్లి కుమార్తె విద్యాశ్రీ భారతమాత ఫోటోలు మార్చుకుని వారి నిశ్చితార్థం చేసుకున్నారు.

ప్రేమికుల రోజు దెబ్బతో వైరల్
వెరైటీగా జరిగిన రవీష్ పటేల్, విద్యాశ్రీ నిశ్చితార్థానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు సాక్షంగా నిలిచారు. వెరైటీగా నిశ్చితార్థం చేసుకున్న టెక్కీలు రవీష్ పటేల్, విద్యాశ్రీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమికుల రోజు వెరైటీగా దేశం మీద ప్రేమతో భరతమాత ఫోటోలతో నిశ్చితార్థం చేసుకున్న టెక్కీలు రవీష్ పటేల్, విద్యాశ్రీని పలువురు అభినందిస్తున్నారు.