వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగసాధువులుగా మారిన 10వేలమంది, డాక్టర్లు, గ్రాడ్యుయేట్స్: పరీక్షల్లో పాస్ సులభం కాదు!

|
Google Oneindia TeluguNews

అలహాబాద్: రజత్ కుమార్ (27) కచ్‌కు చెందినవారు. అతను మెరైన్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా చేశారు. ఈ రూట్లో తన కెరీర్‌ను మలుచుకుంటాడని చాలామంది భావించారు. కానీ అతను మాత్రం ప్రపంచాన్ని పక్కన పెట్టి, తన ఇహ సుఖాలు వదిలేసి.. నాగసాధువుగా మారారు. ముని లేదా రుషిగా ఉండటం చాలా కష్టమైన పని.

కానీ ప్రపంచానికి దూరంగా నాగసాధువుగా మారారు. ఉక్రెయిన్‌లో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ చేసిన శంభుగిరి (29), పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన ఉజ్జయినికి చెందిన ఘనశ్యాం గిరి (18).. ఇలా ఎందరో నాగసాధువులుగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

నాగసాధువులుగా పదివేలమంది

నాగసాధువులుగా పదివేలమంది

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళాలో దాదాపు పదివేల మంది పురుష, మహిళలు నాగసాధువు దీక్ష తీసుకున్నారు.. తీసుకుంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా గత వారం పై ముగ్గురితో పాటు వేలాది మంది పిండ ప్రధానం చేశారు. రాత్రంతా జరిగే పవిత్ర అగ్నిపూజలో పాల్గొన్నారు. తద్వారా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ద్వారా వీరంతా నాగసాధువులుగా మారిపోయారు.

నాగసాధువులుగా మారిన డాక్టర్లు, ఇంజినీర్లు

నాగసాధువులుగా మారిన డాక్టర్లు, ఇంజినీర్లు

ఆ తర్వాత పవిత్ర మౌని అమావాస్య కోసం వేచి చూశారు. సోమవారం (04-02-2019) నాడు పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళా పవిత్ర దినాల్లో ఇది ఒకటి. నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. నాగ సాధువులుగా ఉండటం సామాన్యుల వల్ల కాదు. అఖిల భారతీయ అఖారా పరిషత్ ప్రకారం ఈ కుంభమేళాలో దాదాపు పదివేల మంది దీక్ష తీసుకొని నాగసాధువులుగా మారిపోయారు... మారిపోతున్నారు. నాగసాధువు దీక్ష కేవలం ఇలాంటి కుంభమేలా సమయంలోనే జరుగుతుంది. ఈసారి వేలాది మంది దీక్ష తీసుకున్నారు. ఇందులో డాక్టర్లు, ఇంజినీర్లు కూడా ఉన్నారు.

నాగ సాధువులుగా మారడానికి పరీక్షలు

నాగ సాధువులుగా మారడానికి పరీక్షలు

ఎప్పుడైతే అఖిల భారతీయ అఖారా పరిషత్ వారిని ఆమోదిస్తుందో.. అప్పటి నుంచి వారి జీవితం.. బయటి వారికి చాలా కఠినంగా కనిపిస్తుంది. అప్పటికే ఉన్న నాగసాధువులు తాజాగా నాగసాధువులుగా మారిన వారిని సంవత్సరాల పాటు పరీక్షిస్తారు. వారు నాగసాధువులుగా ఉండగలుగుతారా, కేవలం ఏదో జీవితంపై విసుగుతో అప్పటికప్పుడు ఆగ్రహంతో వచ్చారా లేక నిజంగానే ఎప్పటికీ ఉండగలుగుతారా అని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నాగసాధువులుగా మారిన ఈ వేలాది మందికి ఈ పరీక్ష ఉంటుంది. వారు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. అఖిల భారతీయ అఖారా పరిషత్ ఆమోదించాకే వారు నాగసాధువులుగా కొనసాగుతారట. కొందరు తొందరగానే ఈ పరీక్షల్లో నెగ్గుతారు.

English summary
Despite the hardships and tough regimen associated with the sect, it is estimated by the Akhil Bharatiya Akhara Parishad (ABAP), apex body of the country’s akharas (sect of seers), that over 10,000 men and women are taking deeksha (initiation) and becoming Naga sadhus this Kumbh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X