వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ వివాదం: మోడీని విచారణ చేసేందుకు ఇంతకంటే రుజువులు ఏమి కావాలి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఈ వివాదంపై మరోసారి తన నోటికి పనిచెప్పారు. రాఫెల్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను రక్షణశాఖ కార్యాలయం నుంచి ఎవరో దొంగలించారంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మోడీని విచారణ చేసేందుకు ఇంతకంటే ఆధారాలు ఏమికావాలని ఆయన అన్నారు.

Enough proof now to prosecute PM Modi, says Rahul Gandhi as govt cites ‘stolen’ Rafale files in SC

వివాదాస్పద రాఫెల్ నోటు పై నోరువిప్పిన రక్షణ శాఖ మాజీ కార్యదర్శివివాదాస్పద రాఫెల్ నోటు పై నోరువిప్పిన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి

రాఫైల్ ఒప్పందంపై మొదటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ వచ్చారు. తాజాగా రాఫెల్‌కు సంబంధించి అటార్నీ జనరల్ వేణుగోపాల్ సుప్రీంకోర్టులో డాక్యుమెంట్లు దొంగలించారని చెప్పడం చూస్తే రుజువులను ధ్వంసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఇక ఇంతకంటే రాఫెల్‌లో అవినీతి చోటుచేసుకుందని చెప్పేందుకు రుజువులు ఏం కావాలని రాహుల్ ప్రశ్నించారు. అవినీతిని కప్పిపుచ్చేందుకే డాక్యుమెంట్లు దొంగతనానికి గురైయ్యాయంటూ కొత్త డ్రామాకు ప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు.

రాఫెల్‌లో అవినీతి జరిగిందని స్పష్టమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీని విచారణ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విచారణ ఈయనతోనే మొదలై ఈయనతోనే ముగుస్తుందని జోస్యం చెప్పారు. రాఫెల్ అవినీతి ప్రధాని మెడకు చుట్టుకుంటుందని తెలిసి ఇప్పుడు దొంగతనానికి గురయ్యారని నాటకాలుడుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ఇక డాక్యుమెంట్లు దొంగతనం గురికావడంపై అంతర్గత విచారణ వేశామని కోర్టుకు తెలిపారు వేణుగోపాల్. అయితే ఎఫ్‌ఐఆర్ మాత్రం నమోదు కాలేదు.

English summary
Pointing to the Centre’s claim in the Supreme Court that documents relating to the Rafale deal had been “stolen” from the Defence Ministry, Congress president Rahul Gandhi on Wednesday said there was enough evidence to prosecute Prime Minister Narendra Modi in the case.Leading the Congress’ charge against the government over the multi-crore jet deal, Gandhi said Attorney General KK Venugopal’s assertion in the top court proved there was “destruction of evidence” and an “obvious cover-up”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X