బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Enquiry: లీడర్ ఆత్మహత్య, నాయకుడి భార్య ఏం చెప్పింది ?, ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పింది ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ లీడర్ అనంతరాజు ఆత్మహత్య కేసులో అనేక మంది విచారణ తరువాత ఆ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. అనంతరాజు ఆమె ఫేస్ బుక్ ప్రియురాలితో అక్రమ సంబందం పెట్టుకుని ఆమె టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనంతరాజు భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !

బీజేపీ లీడర్ ను అతని భార్య సుమా టార్చర్ పెట్టడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఇదే సమయంలో అనంతరాజు భార్య సుమా, అతని ప్రియురాలు అంటున్న రేఖా మాట్లాడుకున్న ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో కలకలం రేపింది.

 Enquiry: BJP leader Anantharaju suicide case, Bengaluru police enquire Anantharaju wife suma.

ఇప్పటికే కేసు విచారణ చేస్తున్న పోలీసులు బీజేపీ లీడర్ భార్యకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ నాయకుడు అనంతరాజు భార్య సుమా పోలీసుల విచారణలో అనేక రహస్య సమాచారం బయటపెట్టిందని తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సుమా ఏం చెప్పారు ? అనే విషయాన్ని గోప్యంగా పెట్టారు.

ఆనంతరాజు ఆత్మహత్య చేసుకునే ముందు 40 రోజులు ఇంటి నుంచి బయటకురాలేదని, ఎవ్వరి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చెయ్యలేదని, ఎవ్వరినీ కలవలేదని వెలుగు చూసింది. అయితే ఈ విషయంలో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వడం లేదు.

Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !

బీజేపీ నాయకుడు అనంతరాజు ఆత్మహత్య కేసులో ఆయన భార్య సుమా, అనంతరాజు ప్రియురాలు అని ప్రచారం జరుగుుతన్న కేఆర్ పురం నివాసి రేఖాతో పాటు అనేక మందిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. అనంతరాజు ఉపయోగించిన ఫోన్ నెంబర్ కు సంబంధించిన కాల్ డేటాను పోలీసులు సేకరించి పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు.

అనంతరాజు భార్య సుమా, రేఖా మాట్లాడుకున్న ఆడియో బయటకు రావడంతో ఆ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి అసలు మ్యాటర్ బయటకు లాగుతున్నారు. మొత్తం మీద బీజేపీ నాయకుడు అనంతరాజ్ ఆత్మహత్యకు అసలు కారణం ఎవరు ? అనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Enquiry BJP leader Anantharaju suicide case, Bengaluru police enquire Anantharaju wife suma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X