హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్‌డౌన్ ఉన్నా.. మీడియాకు అంతరాయం కలిగిచొద్దు: రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్‌-19 విజృంభ‌న నేప‌థ్యంలో ప్ర‌సార మాధ్య‌మాల సేవ‌లకు ఎలాంటి అంతరాయం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్‌-19 విజృంభ‌న నేప‌థ్యంలో ప్ర‌సార మాధ్య‌మాల సేవ‌లకు ఎలాంటి అంతరాయం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాల‌ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శుల(సీఎస్)కు కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాలకు, కేంద్రపాలితాలకు సూచనలు

రాష్ట్రాలకు, కేంద్రపాలితాలకు సూచనలు


ఈ మేర‌కు కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా నిర్మూల‌నకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, అయితే అదే స‌మ‌యంలో వివిధ ప్ర‌సార‌ మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేంద్రం ఆ ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌ప‌డింది.

మీడియా తన పాత్ర పోషించాలి..

మీడియా తన పాత్ర పోషించాలి..

టీవీ ఛానెళ్లు, న్యూస్ ఏజెన్సీలు, టెలీపోర్ట్ ఆప‌రేట‌ర్లు, డీఎస్ఎన్‌జీలు, డీటీహెచ్‌లు, ఎంఎస్‌వోలు, కేబుల్ ఆప‌రేట‌ర్లు, ఎఫ్ఎం రేడియోలు, క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్లు ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారంతో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని కేంద్ర స‌మాచార శాఖ త‌న‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేయ‌డంతోపాటు క‌రోనా నిర్మూల‌న కోసం ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ముఖ్య సందేశాల‌ను ప్ర‌సారం చేయాల‌ని సూచించింది. అదే స‌మ‌యంలో త‌ప్పుడు వార్త‌లు, ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసే వార్త‌ల‌కు దూరంగా ఉండాల‌ని కోరింది. తప్పుడు కథనాలు ప్రసారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు లాఠీ దెబ్బలు..

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు లాఠీ దెబ్బలు..

కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి విధుల నిమిత్తం వచ్చిన కొందరు జర్నలిస్టులపై పోలీసులు లాఠీలతో కొట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాము జర్నలిస్టులమని చెప్పినా వినకుండా పోలీసులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపింారు. దాడికి పాల్పడిన సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాకు, జర్నలిస్టులకు అత్యవసర సేవల కింద మినహాయింపు ఉన్నప్పటికీ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

English summary
As 32 states in the country are in a lockdown due to the coronavirus outbreak, the Ministry of Information and Broadcasting on Tuesday asked the governments of states and union territories to ensure proper functioning of media networks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X