వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: సత్యభామ ఆదేశాలు, ఫేమస్ చిక్క‘తిరుపతి’ఆలయంలోకి నో ఎంట్రీ, కరోనా పాజిటివ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు7 కోలారు: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు దేశంలోని ప్రముఖ ఆలయాలు మార్చి 25వ తేదీ నుంచి మూసివేశాసినా లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ ఆలయాలు తెరుచుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నియమాలు పాటిస్తూ అనేక ప్రముఖ ఆలయాల్లోకి భక్తులు వెళ్లడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన చిక్క తిరుపతి ఆలయంలోకి శనివారం, ఆదివారం భక్తులు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కోలారు జిల్లా కలెక్టర్ సత్యభామ ఆదేశాలతో శని, ఆదివారాల్లో ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Coronavirus: కరోనా పాజిటివ్, 'ఆరు'నూరైనా పెళ్లి జరగాలి, శోభనం మమా, అంతలోనే అంత్యక్రియలు !Coronavirus: కరోనా పాజిటివ్, 'ఆరు'నూరైనా పెళ్లి జరగాలి, శోభనం మమా, అంతలోనే అంత్యక్రియలు !

 దక్షిణ భారతదేశంలో ఫేమస్ టెంపుల్

దక్షిణ భారతదేశంలో ఫేమస్ టెంపుల్

ప్రపంచ వ్యాప్తంగా శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్న విషయం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ది చెందిన ఆలయాల్లో ఒకటైన చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలుకాలో ఉంది.

 కర్ణాటక, ఆంధ్రా, తమిళనాడు భక్తులు

కర్ణాటక, ఆంధ్రా, తమిళనాడు భక్తులు

కోలారు జిల్లాలోని చిక్క తిరుపతి ఆలయానికి ప్రతిరోజు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. లాక్ డౌన్ సడలింపులు తరువాత చిక్క తిరుపతి ఆలయంలోకి భక్తులు వెళ్లడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే కరోనా వైరస్ భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా పాజిటివ్ కేసులు

కోలారు జిల్లాలోని ప్రముఖ చిక్క తిరుపతి ఆలయం పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిక్క తిరుపతి ఆలయం పరిసర ప్రాంతాల్లోని రెండు కిలోమీటర్ల పరిధిలో నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో చిక్క తిరుపతి ఆలయంలోకి వస్తున్న భక్తలు చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదని, కనీసం ముఖానికి మాస్క్ లు వేసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 ఆషాడమాసం భయం

ఆషాడమాసం భయం

మామూలుగా ఆషాడమాసంలో చిక్క తిరుపతి ఆలయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆషాడమాసంలోని శనివారం, ఆదివారం రోజుల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో శని, ఆదివారాల్లో ఆలయంలోకి భక్తులు ప్రవేశించకుండా చూడాలని చిక్క తిరుపతి ఆలయం అర్చకులు, స్థానికులు ప్రభుత్వానికి మనవి చేశారు.

 సత్యభామ ఆదేశాలు

సత్యభామ ఆదేశాలు

చిక్క తిరుపతి ఆలయం అర్చకులు, భక్తుల మనవి మేరకు కోలారు జిల్లాధికారి ( జిల్లా కలెక్టర్) సత్యభామ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. చిక్క తిరుపతి పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విదంగా ఆషాడమాసంలోని శనివారం, ఆదివారం భక్తులు చిక్క తిరుపతి ఆలయంలోకి ప్రవేశించకుండా చూడాలని జిల్లాధికారి సత్యభామ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో చిక్క తిరుపతి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదని అధికారులు ముందుగా సమాచారం ఇచ్చారు. భక్తులు వేల సంఖ్యలో చిక్క తిరుపతికి వచ్చి వెలితే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మరింత పెరిగిపోతుందని స్థానికులు భయపడుతున్నారు.

English summary
Coronavirus: As the number of Coronavirus cases increasing, entry restricted for devotees to Chikka Tirupati Venkateswara Swamy temple on Saturday and Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X