వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ పర్యావరణ వేత్త పచౌరీపై లైంగిక ఆరోపణలు, తాత్కాలిక విధులకు సెలవు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళ ఉద్యోగిపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త, ఐపీసీసీ ఛైర్మన్ డాక్టర్ రాజేంద్ర పచౌరీ(74) తాత్కాలికంగా తన విధులకు సెలవు తీసుకున్నట్లు ప్రకటించారు. ఓ మహిళ ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

 Environmentalist RK Pachauri, Accused of Sexual Harassment, Goes on Leave

29 సంవత్సరాలు రీసెర్చ్ అనలిస్ట్ అక్టోబర్ 2013 నుంచి జవరి 2015 వరకు ఇద్దరి మధ్య జరిగిన మెయిల్స్, మెసేజేస్, వాట్సప్ ఛాటింగ్ విషయాలను బయటకు తెలియపరుస్తూ కేసు నమోదుకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు పచౌరీ అరెస్టుకు రంగం సిద్ధం చేయగా బెయిల్ నిమిత్తం ఢిల్లీ కోర్టుని ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు గురువారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

వాతావరణ మార్పులపై ఎప్పుడూ ముందుండి గొంతు వినిపించే, డాక్టర్ పచౌరీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. కంప్యూటర్ హ్యాకింగ్ వల్ల బాధితుడినయ్యానని ఆయన పేర్కొన్నారు. ఈ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నైరోబీలో జరిగే ఐపీసీసీ నాలుగు రోజులు సమావేశాలకు వెళ్లలేకపోయినట్లు తెలిపారు.

English summary
Environmentalist RK Pachauri, who has been accused of sexual harassment, has gone on leave from The Energy and Resources Institute or TERI, the think tank that he leads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X